ఆదిపురుష్ లేటెస్ట్ అప్డేట్.. ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారంటే?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ మామూలుగా లేదు. షూటింగ్స్ కి సంబంధించిన రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ లో ఉంటాడో చెప్పడం కష్టమే. ముందుగా రాధేశ్యామ్ సినిమా పూర్తయితే ప్రభాస్ వెంటనే ఆదిపురుష్ ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు.
దాదాపు మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ లీక్ అయ్యింది. జనవరి 19 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే మొదటి షెడ్యూల్ లో హీరో ప్రభాస్, మెయిన్ విలన్ సైఫ్ అలీ ఖాన్ బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

అలాగే మరికొందరు సీనియర్ స్టార్ యాక్టర్స్ కూడా మొదటి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాట్లు సమాచారం. ఈ షూటింగ్ ను ముంబై ఫిల్మ్ స్టూడియోలో నిర్వహించనున్నారు. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయితే వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా చిత్ర దర్శకుడు ఓం రావత్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మరి సినిమా ప్రేక్షకుల ముందుకి ఎప్పుడు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











