twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Adipurush Teaser: కిడ్స్ ఛానెల్ తో డీలింగ్ ఫిక్స్.. నిజంగానే 500 కోట్లు ఖర్చు చేశారా?

    |

    ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ఎంతోమంది రామ భక్తులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాగా ఆదిపురుష్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే టీజర్ తప్పకుండా సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తుంది అనుకుంటే ఊహించిన విధంగా ట్రోలింగ్స్ కు దారి తీసింది. అసలు నిజంగానే ఈ సినిమాకు 500 కోట్లు ఖర్చు చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే దారుణాతి దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    రామాయణం బ్యాక్ డ్రాప్

    రామాయణం బ్యాక్ డ్రాప్

    బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆదిపురుష్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణం బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తూ ఉండగా సీత పాత్ర కోసం కృతి సనోన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక రావణాసుర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పుడే భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

    500 కోట్లు ?

    500 కోట్లు ?

    ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ ను ఆదివారం రోజు విడుదల చేయగా ప్రేక్షకుల ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ టీజర్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ సినిమా కోసం నిజంగానే 500 కోట్లు ఖర్చుపెట్టారా అనేక రకాలు ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు.

    చిన్న పిల్లలు చూసే బొమ్మలు

    చిన్న పిల్లలు చూసే బొమ్మలు

    త్రీడీ మోషన్ పిక్చర్ క్వాలిటీతో ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ అదేమీ అంత క్వాలిటీతో లేదు అని అసలు చిన్న పిల్లలు చూసే బొమ్మల తరహాలో గ్రాఫిక్స్ ఉంది అని ఆవేదన చెందుతున్నారు. అసలు ఈ రేంజ్ లో ఉంటుంది అని ఊహించలేదు అని దర్శకుడు ఇన్ని రోజులు కష్టపడింది దీని కోసమా అని షాక్ అవుతున్నారు.

    నెగిటివ్ ట్యాగ్స్

    నెగిటివ్ ట్యాగ్స్

    అంతేకాకుండా సోషల్ మీడియాలో మరికొందరు ఇదే అవకాశం గా భావించి చాలా దారుణంగా అయితే ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికి నెగిటివ్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నిజంగా ఇది షాకింగ్ అంటే అసలు ఇంత పెద్ద భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న స్టార్ ను ఈ విధంగా చూపించడం ఏమంత బాగోలేదు అని అంటున్నారు.

    శాటిలైట్ హక్కులు వాళ్ళకు

    శాటిలైట్ హక్కులు వాళ్ళకు

    అంతేకాకుండా పోగొ ఛానల్ అలాగే కార్టూన్ నెట్వర్క్ కూడా ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం పోటీపడుతున్నట్లుగా మరికొందరు కామెంట్ చేస్తూ ఉండడం వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా రావణాసురుడి పాత్రకు స్టైలిష్ ఎవరయ్యా ఆ స్టైల్ ఏమిటి అని కూడా ట్రోలింగ్స్ చేస్తూ ఉండడం విశేషం. ముఖ్యంగా అతను ఒక రాక్షస పక్షిపై ట్రావెల్ చేస్తున్న ఫోటోను కూడా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ తరహా కామెంట్స్ కు చిత్ర యూనిట్ సభ్యులు నెక్స్ట్ అప్డేట్ తో అయినా సంతృప్తి పరుస్తారో లేదో చూడాలి.

    English summary
    Prabhas Adipurush Teaser unexpected trolling on social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X