Adipurush: అక్కడ రికార్డ్ స్థాయిలో ఆదిపురుష్ టికెట్ ధర.. ఎక్కడెక్కడా ఎంత ఉందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తూ భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. ఇప్పుడు అతి త్వరలో అంటే రేపు జూన్ 16న విడుదల కానున్న ప్రభాస్ మూవీ ఆదిపురుష్. బ్యూటిఫుల్ కృతి సనన్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కించారు.అయితే ఆదిపురుష్ మూవీ రేపే విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ రేట్స్ ఆసక్తికరంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధర పెంచగా.. ఒక చోట మాత్రం రికార్డ్ స్థాయిలో ఆదిపురుష్ టికెట్ రేట్ ఉంది.
సాధారణంగా ఒక టికెట్ ధర ఎంత ఉంటుంది. రూ. 500, వెయ్యి, 1500 అలా ఉంటుంది. అది కూడా అభిమానుల కోసం వేసే షోలకు. కానీ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు మాత్రం టికెట్ ధర రికార్డ్ క్రియేట్ చేస్తుంది. శ్రీరాముడిగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై ప్రపంచస్థాయిలో అంచనాలు భారీగా నెలకొన్న విషయం తెలిసిందే. అందుకు తగినట్లుగానే టికెట్ ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచారు.

తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్సుల్లో కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో ఒక్కో టికెట్ కు రూ. 50 అదనంగా పెంచుకునేందుకు అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ యాంబియెన్స్ మాల్ లో ఆదిపురుష్ టికెట్ ధర రూ. 2200గా నిర్ణయించారు. పీవీఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్ లో శుక్రవారం రాత్రి 9.15 నిమిషాల షోకి హిందీ ఆదిపురుష్ 2డీ వెర్షన్ ప్లాటినమ్ కు అయితే రూ. 2 వేలు, ప్లాటినమ్ సుపీరియర్ కు అయితే రూ. 2200 చెల్లించాల్లి ఉంటుంది.
పీవీఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్ లో శుక్రవారం రాత్రి 7 గంటల షోకి త్రీడీ వెర్షన్ టికెట్ కు రూ. 2250గా ఫిక్స్ చేశారు. ప్లాటినమ్ సుపీరియర్ లో ఇలా ఉంటే అదే ప్లాటినమ్ లో రూ. 2050గా ఉంది. ఇలా ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఆదిపురుష్ టికెట్స్ ఉండగా ఇప్పటికే అవన్ని అమ్ముడుపోవడం విశేషం.
ఇక హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో తెలుగు త్రీడీ ధర రిక్లెయినర్ లో రూ. 385గా ఉంటే మాములు సీట్ టికెట్ ధ రూ. 330గా ఉంది. 2డీ రిక్లెయినర్ ధర రూ. 350 కాగా మాములు టికెట్ రేట్ రూ. 295గా ఫిక్స్ అయింది. ఇక సింగిల్ థియేటర్ త్రీడీలో రూ. 130, రూ 180, రూ. 260 చొప్పున క్లాసుల వారీగా ధరలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











