Prabhas: ప్రభాస్ - హను సినిమా వివరాలు లీక్.. ఆరోజే ప్రకటన.. షూట్ అప్పటి నుంచే!

ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమాతో రావడం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది పాన్ ఇండియా స్టార్ అయినా ఏకకాలంలో నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ముఖ్యంగా అన్నీ భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తోన్న అతడు.. ఇటీవలే 'ఆదిపురుష్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని ఫలితం ఎలా ఉన్నా.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు ప్రభాస్ ఎన్నో సినిమాల షూటింగ్‌లను ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇప్పటికే 'సలార్', 'ప్రాజెక్టు కల్కి', 'స్పిరిట్'తో పాటు మారుతితో సినిమాను చేస్తున్న ప్రభాస్.. 'సీతా రామం' దర్శకుడు హను రాఘవపూడితో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు సమాచారం లీకైంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

Prabhas and Hanu Raghavapudi Movie Details Leaked

కానీ, ఇప్పటి వరకూ అటు ప్రభాస్ నుంచి కానీ, ఇటు డైరెక్టర్ నుంచి కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ - హను రాఘవపూడి మూవీకి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతున్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కనుందని ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి మొదలు పెట్టబోతున్నారట.

అంతకంటే ముందు అంటే ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని తెలిసింది. నవంబర్‌లో పూజా కార్యక్రమాలను జరిపేసి.. మొత్తానికి డిసెంబర్‌లో పట్టాలెక్కించబోతున్నారు. అప్పటికే ప్రభాస్ కొన్ని చిత్రాలను కంప్లీట్ చేస్తాడని సమాచారం.

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించబోతున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఐదు భాషల్లో రూపొందిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X