గుట్టుచప్పుడు కాకుండా దిగిన ప్రభాస్.. అప్పుడే ఒకటి కంప్లీట్ చేశాడుగా!

గతంతో పోలిస్తే ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అయితే, వాళ్లందరిలో ఆద్యుడిగా చెప్పేది మాత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌నే అన్న విషయం తెలిసిందే. రాజమౌళి తీసిన 'బాహుబలి'తో ఇంటర్నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. అప్పటి నుంచి భారీ చిత్రాల్లోనే భాగం అవుతూ సత్తా చాటుతోన్నాడు. ఇలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే సినిమాలు చేస్తోన్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితో 'రాజా డీలక్స్' అనే సినిమా చేయబోతున్నాడని ఆ మధ్య ఓ న్యూస్ లీకైంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత షూట్ ప్రారంభోత్సవం, ఫస్ట్ షెడ్యూల్ గురించి కూడా ఎంతో టాక్ నడిచింది. ఈ క్రమంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 17వ తేదీన జరుగుతాయని కూడా అన్నారు. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. కానీ, దీనిపై చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన కూడా రాలేదు.

 Prabhas and Maruthi Movie Completes First Schedule

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ - మారుతి సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను దీపావళి పండుగ తర్వాత మొదలు పెట్టారట. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుందని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, దాదాపు వారం రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. మళ్లీ ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను మాత్రం ప్రభాస్ డేట్స్‌ను బట్టి ప్రారంభించేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా వచ్చే ఏడాది సమ్మర్ నాటికి దీన్ని పూర్తి చేస్తారని టాక్.

ప్రభాస్ - మారుతి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X