Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేది ఆరోజే
Prabhas movie first look:తెలుగులో ఇప్పుడు చాలా మందే స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సినిమా స్థాయిని పెంచడంతో పాటు తమ రేంజ్‌ను కూడా భారీగా విస్తృతపరుచుకున్నారు. అలాంటి వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ చిన్న చిత్రాలకు పరిమితం అయిన అతడు.. 'బాహుబలి' తర్వాత నుంచి దేశ వ్యాప్తంగా మార్కెట్‌ను పెంచుకుంటూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు వరుసగా 'సలార్', 'ప్రాజెక్టు K', 'స్పిరిట్'తో పాటు మారుతితోనూ ఓ సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే.
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ఇప్పటికే న్యూస్ లీకైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో సీక్రెట్‌గా సాగుతోంది. ఇందుకోసం ఓ బూత్ బంగ్లా సెట్‌ను నిర్మించి, అందులో షూటింగ్‌ను చేస్తున్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా 40 శాతానికి పైగా టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకునేలా చిత్ర యూనిట్ వ్యూహాలు రెడీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్ - మారుతి కాంబోలో హర్రర్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రచార చిత్రమూ రాలేదు. దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తాజాగా తెలిసింది. దీన్ని అక్టోబర్ 23న రిలీజ్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన అంటూ ఏమీ లేకుండానే ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
విభిన్నమైన కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి 'రాయల్', 'వింటేజ్ కింగ్', 'అంబాసీడర్', 'రాజా డీలక్స్' వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











