ఆ హీరోయిన్‌తో ప్రభాస్ సీక్రెట్ ప్లాన్: ఫ్యాన్స్‌కు అసలు విషయం తెలిస్తే!
తెలుగు సినిమాల్లో స్థాయిని పెంచుకున్న హీరోలు చాలా మందే ఉంటే.. పరిశ్రమ రేంజ్‌ను అమాంతం పెంచేసిన హీరోలు టాలీవుడ్‌లో కొంత మంది మాత్రమే ఉన్నారు. అందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. 'బాహుబలి' తర్వాత నుంచి దేశ వ్యాప్తంగా మార్కెట్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న అతడు.. పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతూ బహు భాషా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. అదే సమయంలో భారీ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఇలా ఇప్పుడు 'సలార్', 'ప్రాజెక్టు K', 'స్పిరిట్'తో పాటు మారుతితోనూ ఓ సినిమాను చేస్తోన్నాడు.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో సీక్రెట్‌గా సాగుతోంది. ఇందుకోసం ఓ బూత్ బంగ్లా సెట్‌ను నిర్మించి, అందులో షూటింగ్‌ను జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా 30 శాతానికి పైగా టాకీ పార్టును పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకునేలా చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

హర్రర్ కామెడీతో ప్రభాస్ - మారుతి కాంబోలో మూవీగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా భాగం కాబోతుంది. ఇప్పటికే ఆమె లుక్‌కు సంబంధించిన టెస్ట్ కూడా పూర్తైంది. ఈ షెడ్యూల్‌లో ఆమెకు ప్రభాస్‌కు మధ్యన వచ్చే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఇదంతా ఎంతో సీక్రెట్‌గా జరిపేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఈ వార్త ఇప్పటికే బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సూపర్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'రాయల్', 'వింటేజ్ కింగ్', 'అంబాసీడర్', 'రాజా డీలక్స్' వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











