ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త: కొత్త సినిమా డేట్, షూట్ వివరాలు లీక్
సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. కెరీర్ ఆరంభంలో తెలుగు చిత్రాలకే పరిమితం అయిన అతడు.. 'బాహుబలి' పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని సినిమాలను కూడా ప్రేక్షకులను అందించిన ఈ నేషనల్ స్టార్.. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ మరో సినిమాను కూడా చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితో 'రాజా డీలక్స్' అనే సినిమా చేయబోతున్నాడని ఆ మధ్య ఓ న్యూస్ లీకైంది. ఈ నేపథ్యంతో తాజాగా దీని గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 17వ తేదీన జరగబోతున్నాయట. దీన్ని అంగరంగ వైభవంగా జరపబోతున్నారని తెలిసింది.

అంతేకాదు, పూజా కార్యక్రమాలు మొదలైనప్పటి నుంచే ప్రభాస్ - మారుతి సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. దీన్ని మూడు నాలుగు రోజుల పాటు కంటిన్యూ చేయబోతున్నారని అంటున్నారు. ఇందులో హీరో ప్రభాస్‌పై కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తారని సమాచారం. ఇక, ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ కోటకు సంబంధించిన సెట్‌ను నిర్మించారు. అందులోనే ఎక్కువ శాతం చిత్రీకరణ జరపబోతున్నారని ఫిల్మ్ నగర్ ఏరియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ - మారుతి కాంబోలో క్రేజీ కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం రొమాంటిక్ హర్రర్ కామెడీతో రాబోతుందట. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది. ఇక, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 17వ తేదీన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ మూవీ గురించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని ఇన్‌సైడ్ టాక్.


Click it and Unblock the Notifications











