రాజా సాబ్ నుంచి సడన్ సర్‌ప్రైజ్.. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ వచ్చేస్తుంది

ప్రభాస్.. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపించడంతో పాటు ఈ మధ్య కాలంలో మన సినిమా స్థాయిని ప్రపంచానికి చాటు చెబుతున్నాడు. దీంతో ఈ బడా హీరో రేంజ్ మరింతగా పెరుగుతోంది. ఫలితంగా ప్రభాస్ మరింత ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

'బాహుబలి 2' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తోన్న ప్రభాస్.. గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో వచ్చి సక్సెస్ సాధించాడు. ఇక, ఇటీవలే అతడు 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం 1100 కోట్లకు పైగా కలెక్షన్లతో సత్తా చాటింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు.

Prabhas and Maruthi The Raja Saab Fan India Glimpse Release on July 29th

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. అందులో 'ది రాజా సాబ్' ఒకటి. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం హర్రర్ కామెడీ కాన్సెప్టుతో రాబోతుంది. వాస్తవానికి దీనికి సంబంధించిన ప్రకటన అయితే అధికారికంగా రాలేదు. కానీ, షూటింగ్‌ను మాత్రం ఎప్పుడో మొదలు పెట్టారు. అప్పటి నుంచి చిత్రీకరణ జరుపుకుంటూ చాలా వరకూ పూర్తి చేసుకున్నారు.

ప్రభాస్ హీరోగా చేస్తున్న 'ది రాజా సాబ్' సినిమా నుంచి అప్పుడప్పుడూ కొన్ని అప్‌డేట్లు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ కూడా రివీల్ అయింది. అలాగే, ఓ సాంగ్ ట్రాక్‌ను సైతం వదిలారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే సర్‌ప్రైజ్ కూడా రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 'ది రాజా సాబ్' మూవీ నుంచి ఫ్యాన్ గ్లింప్స్ పేరిట ఓ వీడియోను విడుదల చేయబోతున్నారు. దీన్ని జూలై 29వ తేదీన సాయంత్రం 5:03 గంటలకు వదలబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను సైతం వదిలింది. ఇందులో ప్రభాస్ ఫుల్ హ్యాండ్సమ్ లుక్‌తో కనిపిస్తున్నాడు. దీంతో ఈ గ్లింప్స్‌పై అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉండగా.. హై రేంజ్ బడ్జెట్‌తో రాబోతున్న 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

More from Filmibeat

Read more about: the raja saab prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X