The Raja Saab: చిరంజీవితో ప్రభాస్ పోటీ.. కన్ఫార్మ్ చేసేసిన బడా నిర్మాత
తెలుగు సినిమాల ద్వారా తమ రేంజ్‌ను పెంచుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్లు మాత్రం కొందరే ఉన్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు.
ఈ మధ్య కాలంలో చాలా పరాజయాలను చవి చూసిన ప్రభాస్.. 'సలార్: సీజ్‌ఫైర్' హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు తన కొత్త సినిమాలపై ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే పట్టాలెక్కించిన పలు ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందించే 'ది రాజా సాబ్' మూవీ ఒకటి.

రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కలయికలో హర్రర్ కామెడీతో రూపొందుతోన్న 'ది రాజా సాబ్' సినిమాను సీక్రెట్‌గానే మొదలు పెట్టి చాలా షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 40 శాతం వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది.
ప్రభాస్ హీరోగా చేస్తున్న 'ది రాజా సాబ్' సినిమా రిలీజ్ గురించి చాలా రోజులు నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని 2024లోనే విడుదల చేస్తారని, కాదు కాదు 2025లో తీసుకు వస్తారని టాక్స్ వినిపించాయి. దీంతో ప్రభాస్ అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 'ది రాజా సాబ్' మూవీని 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాత వెల్లడించారు. అయితే, ఆయన ఈ విషయాన్ని మాత్రం కన్ఫార్మ్‌గా చెప్పలేదు. ఒకవేళ 'రాజా సాబ్' సంక్రాంతికే విడుదలైతే.. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'తో పోటీ పడాల్సి వస్తుందని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











