ప్రభాస్ ‘స్పిరిట్' మూవీలో చిరంజీవి? సందీప్ రెడ్డి వంగా క్లారిటీ.. ఇక బాక్సాఫీస్‌కి దడే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)- సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో స్పిరిట్ (Spirit)అనే తెరకెక్కబోతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డుస్థాయిలో వైరల్ అవుతూ, తెలుగు మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులలోనూ ఆసక్తి రేపింది. అలాగే, ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ రోల్‌లో నటించనున్నారట. ఇది 'యానిమల్‌'లో అనిల్‌ కపూర్‌ తరహాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆ కథనాలపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పి, సినిమాపై అమాంతం హైప్స్ క్రియేట్ చేశారు.

"స్పిరిట్ (Spirit)" భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం.. స్పిరిట్ 2026 ఫిబ్రవరిలో షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లనుంది. పూజా కార్యక్రమం ఈ నెలాఖరులో జరగనుంది. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ను భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ కలిసి నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Prabhas and Sandeep Reddy Vanga s Spirit Chiranjeevi Rumours Denied Don Lee Buzz Grows

ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలయికగా రూపొందుతున్న ఈ సినిమాలో హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ గా 'యానిమల్' ఫేమ్ త్రుప్తి దిమ్రి (Trupti Dimri) నటించనున్నారు. తరుణ్, మడోన్నా సెబాస్టియన్, శ్రీకాంత్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

అయితే.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో "మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో నటించబోతున్నారు" అని అనే వార్త తెగ హడావిడి చేసింది. అయితే, ఈ వార్తలపై స్వయంగా దర్శకుడు సందీప్ వంగా స్పందించారు. ఆయన స్పష్టంగా చెబుతూ "చిరంజీవి గారు ఈ సినిమాలో లేరు. ఆయన ప్రభాస్ తండ్రి పాత్రలో నటించడం పూర్తిగా తప్పుడు వార్త" అని క్లారిటీ ఇచ్చారు. దీంతో మెగాస్టార్ పేరుతో వస్తున్న రూమర్స్‌కు ఎండ్ కార్డ్ పడింది.

అయితే అదే సమయంలో మరో ఆసక్తికరమైన ప్రశ్న అడిగినప్పుడు వంగా మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. అదేమిటంటే.. "దక్షిణ కొరియా యాక్షన్ స్టార్ డాన్ లీ (Don Lee) స్పిరిట్‌లో విలన్‌గా నటిస్తున్నారా?" అనే ప్రశ్న. దీనిపై వంగా నేరుగా సమాధానం ఇవ్వకుండా "అప్‌డేట్ త్వరలోనే వస్తుంది" అంటూ ఫ్యాన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశారు.

గ్లోబల్ లెవెల్ యాక్షన్ మూవీగా స్పిరిట్.. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు ఎంత పవర్ పుల్ ఎమోషన్‌ యాక్షన్ మూవీగా మారాయో తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్రభాస్‌తో జతకట్టడం వల్ల స్పిరిట్ గ్లోబల్ లెవెల్‌లో పాన్ వరల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది.

ఇక కొరియన్ స్టార్ డాన్ లీ ఎంట్రీ నిజమైతే.. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాకి మరో మైలురాయిగా మారడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద, స్పిరిట్ టీజర్‌ తో మొదలైన హైప్ ఇప్పుడు డబుల్ అయింది. చిరంజీవి రూమర్లకు తెరపడినప్పటికీ, డాన్ లీ పై వంగా సైలెన్స్ అభిమానుల్లో కొత్త ఉత్కంఠను పెంచింది. "స్పిరిట్" రాబోయే సంవత్సరాల్లో ప్రభాస్ కెరీర్‌లోనే కాక, భారతీయ సినీ చరిత్రలో మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని మూవీ లవర్స్ భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X