Adipurush Teaser: ప్రభాస్ సీరియస్ అయిన వీడియో వైరల్.. దర్శకుడిని నా గదిలోకి రా అంటూ..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల కావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఊహలకు అందనివిధంగానూ టీజర్ ను చాలా నిరాశపరిచే విధంగా డిజైన్ చేసినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ డైరెక్టర్ పై సీరియస్ అయినట్లుగా కొన్ని కథనాలు అయితే వినబడుతున్నాయి. ఇక ప్రభాస్ కు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతుంది. ఆ వివరలలోకి వెళితే..

నెగిటివ్ రియాక్షన్
రామాయణం కథ ఆధారంగా రూపొందిస్తున్న ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు. ఇక సీత పాత్రలో కృతి సనోన్ కనిపించనుంది. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఆదివారం రోజు విడుదల చేయక తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్స్ అందుకుంది.

గ్రాఫిక్స్ పై అభ్యంతరాలు
ఆదిపురుష్ 3D మోషన్ గ్రాఫిక్స్ టెక్నాలజీతో తెరపైకి తీసుకురాబోతున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు ఆ టెక్నాలజీ లో నాణ్యత లేని విధంగా చిత్ర యూనిట్ వర్క్ చేసిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. దాదాపు 500 కోట్ల వరకు సినిమా కోసం ఖర్చు చేయబోతున్నట్లు ప్రచారాలు చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మాత్రం పిల్లలు చూసే గ్రాఫిక్స్ ను ఉపయోగించినట్లుగా ఉందని రియాక్ట్ అవుతున్నారు.

దర్శకుడిపై అసహనం
అయితే టీజర్ విడుదల తర్వాత చిత్ర యూనిట్ సభ్యులలో ఒక్కసారిగా అలజడి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల చేస్తే మాత్రం ఎవరూ చూడరు అని.. ఇంత తక్కువ స్థాయి గ్రాఫిక్స్ ఇటీవల కాలంలో టీవీలలో కూడా రావడం లేదు అనే కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ కూడా చిత్ర యూనిట్ సభ్యులపై ముఖ్యంగా దర్శకుడిపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లు అయితే వచ్చింది.
నా గదిలోకి రా అంటూ
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ కు సంబంధించిన మరొక వీడియో కూడా వైరల్ గా మారుతుంది. ప్రభాస్ దర్శకుడిని సీరియస్.. నా గదిలోకి రా అంటూ పిలవడం పై సోషల్ మీడియాలో కూడా అనేక రకాల మీమ్స్ సైతం వైరల్ అవుతున్నాయి. ఓం రౌత్ ప్రభాస్ పిలుస్తున్న విధానం చూస్తూ ఉంటే టీజర్ తర్వాతనే ఇది జరిగి ఉండవచ్చు అని విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి.

అప్పటినుంచి ఈ సినిమాపై అనుమానాలు
ఆదిపురుష్ సినిమా ఫస్ట్ టీజర్ అసలు మూడు నెలల క్రితం విడుదల చేయాలి ముఖ్యంగా ఈ సినిమా టీజర్ ను ఈ ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ దర్శకుడు గతంలో ప్రభాస్ పుట్టినరోజు సమయంలో కూడా ఎలాంటి ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయలేదు. దీంతో అప్పటినుంచి ఈ సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి అనే విధంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాలు భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి అప్పుడు సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











