ప్రభాస్ ఒరిజినల్ లుక్‌పైనా ట్రోలింగ్.. 'బేబి' డైరెక్టర్‌లా ఉన్నాడంటూ ఘోరంగా!
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఇలా ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలు ఉండగా.. జూలై 6న సలార్ గ్లింప్స్ తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. అలాగే జూలై 19న ప్రాజెక్ట్ కె నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ అమెరికాలో ఉన్నాడు. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అంచనాలు:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా జత కట్టిన సినిమా ప్రాజక్ట్ కె. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, లోక నాయకుడు కమల్ హాసన్ వంటి భారీ తారాగరణం నటిస్తోంది. ఇక ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే.

ఫ్యాన్స్ నిరాశ :ప్రాజెక్టె కె నుంచి విడుదలైన పోస్టర్స్, మేకింగ్ వీడియోలు ఇప్పటికీ ఎంతో క్యూరియాసిటీ పెంచేశాయి. విష్ణువు చివరి అవతారం కల్కిగా ప్రభాస్ పాత్ర ఉండబోతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే అది చూసి అభిమానులు ఘోరంగా నిరాశచెందారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతోంది.
ప్రభాస్ పిక్స్:ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ను ప్రపంచవేదిక అయిన అమెరికా శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)పై విడుదల చేయనున్నారు. జూలై 20న అంటే ఇవాళ టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం అమెరికాలో ప్రభాస్ సందడి చేశాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
కామెంట్స్:బ్లూ కలర్ బ్లేజర్ ధరించిన ప్రభాస్ లోపల మరో బ్లూ కలర్ టిషర్ట్ తో ఫినిషింగ్ ఇచ్చాడు. శాన్ డియాగో కామిక్-కాన్ లో భాగంగా అక్కడ ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చాడు ప్రభాస్. డార్లింగ్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతుంటే నెటిజన్లు మాత్రం వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అతనిలా ఉన్నాడు:డార్లింగ్ ప్రభాస్ అచ్చం బేబి మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ లా ఉన్నాడని కామెంట్స్, ట్వీట్స్ చేస్తున్నారు. 'సాయి రాజేష్ లా ఉన్నాడు కదా' అంటూ డైరెక్టర్ ఫొటోను షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా 'హిట్ పడేసరికి సూట్ వేసుకున్నాడా అనుకున్నా. 5 సెకన్లు చూశాక అర్థం అయింది ప్రభాస్ అని' మరొకరు కామెంట్ చేశారు. ఇలా ప్రాజెక్ట్ కె రిలీజ్ చేసిన లుక్ పైనే కాకుండా ప్రభాస్ ఒరిజనల్ లుక్ పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











