కల్కి 2898 ఏడీపై ప్రభాస్ పెద్దమ్మ రివ్యూ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, సినిమా గురించి ఏం చెప్పారంటే?
యువ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా తొలి ఆట నుంచే భారీ వసూళ్లను రాబడుతున్నది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో దూసుకుపోతున్నది. ఈ క్రమంలో ప్రభాస్ పెద్దమ్మ ఉప్పలపాటి శ్యామలదేవి ఐమాక్స్ థియేటర్‌కు వచ్చి సందడి చేశారు. అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సినిమా గురించి ఆమె ఏం చెప్పిందంటే?
ప్రభాస్ పెద్దమ్మ, స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవీ కల్కి మూవీ రిలీజ్ రోజున హైదరబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో అభిమానులతో కలిసి సినిమాను చూశారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ హుషారు పుట్టించారు.

ప్రసాద్ ఐమాక్స్ వద్ద పెట్టిన బుజ్జి ఫ్యూచరిస్టిక్ వెహికిల్‌లో కూర్చోని ఫోటోలు దిగారు. సినిమా హిట్ సాధించిందనే ఆనందం ఆమె ముఖంలో కనిపించింది. ఆ సంతోషాన్ని అక్కడే ఉన్న అభిమానులతో పంచుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియా, అభిమానులతో మాట్లాడారు.
ప్రభాస్ ఫ్యాన్స్‌కు కల్కి సినిమా ఓ పెద్ద పండుగ..వెయి పండుగలు కలిపితే వచ్చే పండుగ. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కల్యాణ్ అభిమానులకు రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. విజువల్స్ చాలా బాగున్నాయి. వేరే లెవల్‌లో తీశారు అని మీడియాతో శ్యామల దేవీ అన్నారు.
కల్కి సినిమా చూసిన తర్వాత మాటలు ల్లేవు. మా బాబు ప్రభాస్‌ను చూస్తే.. తెర మీద ఆయనను చూస్తే.. 1000 రెబల్ స్టార్స్‌ను చూస్తే ఒక్క రెబల్ స్టార్ ప్రభాస్ అనిపించింది. ఈ సినిమా హిట్ చేసిన ప్రతీ ఒక్కరికి , అందరి హీరోల అభిమానులకు ధన్యవాదాలు అని అన్నారు.


Click it and Unblock the Notifications











