వేణుస్వామి..ముందు నీ జాతకం చూసుకో.. ఓ రేంజ్‌లో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఫైర్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 3898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా దుమ్ము రేపుతోంది. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ కలయికగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, కమల్ హాసన్ నటనకు తోడు విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. భారతీయుల ఇతిహాసం మహాభారతంలోని అంశాలను టచ్ చేయడంతో కల్కి నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది.
చాలా రోజుల తర్వాత థియేటర్లు కళకళలాడుతున్నాయి. చిన్నా పెద్దా కుటుంబ సమేతంగా కల్కికి పోటెత్తడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ సినిమా కేవలం 9 రోజుల్లోనే రూ.800 కోట్ల వసూళ్లను సాధించినట్లుగా తెలుస్తోంది. ఈ వీకెండ్ కూడా కలెక్షన్లు బాగుంటాయని.. వచ్చే వారంలో కల్కి ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మధ్యలో మరే పెద్ద సినిమా లేకపోవడంతో కల్కి.. స్లో అండ్ స్టడీగా వసూళ్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు.. కల్కి 3898 ఏడీ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌లో డార్లింగ్‌కు తిరుగులేదంటూ ప్రతిరోజూ కల్కి రికార్డులు, వసూళ్ల వివరాలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో గతంలో ప్రభాస్ సినిమాలు, ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసిన వారిని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకుంటున్నారు.
మిగిలిన వారి సంగతేమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్‌కి , వేణుస్వామికి అస్సలు పడదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ జాతకం ఏమాత్రం బాలేదని .. అతని సినిమాలు ఆడవని, పైగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్లుగానే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌లు ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే సలార్ రిలీజ్‌కు ముందు కూడా .. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని, ఎవ్వరూ ఆశలు పెట్టుకోవద్దని వేణుస్వామి జోస్యం చెప్పారు.
అయితే సలార్ రిలీజైన తర్వాత తొలిరోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ వేణుస్వామిపై ట్రోలింగ్‌కు దిగారు. అయితే దీనికి ఆయన వెంటనే కౌంటర్ ఇచ్చారు. సలార్ అభిమానులకు మాత్రమే హిట్ అని, నిజానికి అది ఫ్లాప్ సినిమా అని చెప్పుకొచ్చాడు. సలార్‌తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత సెటిల్ చేశాడని అప్పట్లో ఓ వార్త ప్రచారం జరిగింది. దీంతో వేణుస్వామి రంగంలోకి దిగి ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానంటూ ఓ మీమ్‌ను వదిలాడు. ఆ గొడవ కొద్దిరోజులకు సద్దుమణిగిపోయింది.

ఇప్పుడు కల్కి 2898 ఏడీ బ్లాక్‌బస్టర్ కావడంతో మరోసారి ప్రభాస్ అభిమానుకు దొరికిపోయారు వేణుస్వామి. ఇప్పుడు వేణుస్వామి తన జాతకం చూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ప్రభాస్ కెరీర్, పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు జ్యోతిష్యులు చెప్పారని అన్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు విజయం దక్కదని కొందరు చెప్పారని.. కానీ వారి అంచనాలు తారుమారు అయ్యాయంటూ పరోక్షంగా వేణుస్వామికి శ్యామలా దేవి చురకలంటించారు. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ ఇదే జరుగుతుందని.. ఆయనకు పెళ్లి చేయాలని మాకూ ఉందని, అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శ్యామలా దేవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











