Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రాధేశ్యామ్ మోషన్ పోస్టర్.. మరో ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళుతున్న ప్రభాస్, పూజా హెగ్డే
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్ బడ్జెట్ లవ్ స్టొరీ రాధేశ్యామ్ మూవీ. గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆకట్టుకొనున్నట్లు చిత్ర దర్శకుడు ఇదివరకే ఒక హింట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ తో సరికొత్తగా సర్ ప్రైజ్ ఇచ్చారు. మొత్తానికి ఈ మోషన్ పోస్టర్ ఆడియెన్స్ ని అమితంగా ఆకట్టుకున్నట్లు అర్ధమవుతోంది.
Recommended Video
చారిత్రాత్మక ప్రేమ జంటలను చూపిస్తూ
ఒక ట్రైన్ లో చారిత్రాత్మక ప్రేమ జంటలను చూపించిన చిత్ర యూనిట్ నాలుగవ జోడిగా ప్రభాస్, పూజా హెగ్డే లుక్స్ ని రివీల్ చేశారు. అంటే సినిమా ఒక విధంగా పిరియాడిక్ కాన్సెప్ట్ కో రూపొందనున్నట్లు ఈజీగా అర్ధమవుతోంది. ప్రభాస్ లుక్ కూడా నెవర్ బోఫోర్ అనేలా ఉంది. ఈ సినిమాపై పెరిగిన అంచనాలకు తగ్గట్లుగా మోషన్ పోస్టర్ ని బాగానే ప్రజెంట్ చేశారు.
ఒక ఫ్రెష్ లవ్ స్టొరీ
చూస్తుంటే సినిమా ఒక ఫ్రెష్ లవ్ స్టొరీ అని అర్థమవుతోంది. పూజా హెగ్డే కూడా నెవర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చింది. ఒక ట్రైన్ లో వారిద్దరు ఇచ్చిన స్టిల్ అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియెన్స్ ని అమితంగా ఆకట్టుకుంటోంది.
ఆభిమానులు హ్యాపీ
ముందుగా సినిమాకు సంబంధించిన టీజర్ వస్తుందని ఆడియెన్స్ చాలా ఆశగా ఎదురుచూశారు. కానీ చిత్ర యూనిట్ ఊహించని విధంగా కేవలం మోషన్ పోస్టర్ తో సరిపెట్టనుందని తెలిశాక కొంత నిరాశలో చెందారు. కానీ ఇప్పుడు ఇది చూశాక టీజర్ ని మోషన్ పోస్టర్ ని మిక్స్ చేసి అందించినట్లుగా ఉందని అంటున్నారు.
విక్రమాదిత్య లుక్ కూడా వైరల్
ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ గోపికృష్ణ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మొన్న రిలీజ్ చేసిన ప్రభాస్ విక్రమాదిత్య లుక్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మోషన్ పోస్టర్ తోనే ఈ రేంజ్ లో సర్ ప్రైజ్ ఇచ్చారు అంటే సినిమా టీజర్ ని ఇంకా ఏ రేంజ్ లో ప్రజెంట్ చేస్తారో అని అంచనాలు పెరుగుతున్నాయి.