ప్రభాస్ ఫ్యామిలీ ఫొటో వైరల్.. ఒకే ఫ్రేమ్ లో 50మందికి పైగా..

బాహుబలి అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ స్థాయి ఒక్కసారిగా ఆకాశాన్ని దాటేసింది. బాహుబలి సినిమా అనంతరం వరుసగా అంతకు మించి అనేలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ప్రభాస్ మరిన్ని పెద్ద సినిమాలను పాన్ ఇండియన్ మార్కెట్ లోకి తీసుకు రాబోతున్నట్లు అర్థమవుతోంది. ఆయన డేట్స్ చేస్తే చాలు ఎంతో మంది దర్శక నిర్మాతలు అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రభాస్ బయట లైఫ్ లో ఎంత సింపుల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం వెండితెరపై మాత్రమే తన స్టార్ హోదాను చూపిస్తూ ఉంటాడు. ఇక పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ లో అయితే ప్రభాస్ ఇంకా కూల్ గానే ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు.

పెళ్లిని వాయిదా వేస్తూ..

పెళ్లిని వాయిదా వేస్తూ..


రెబల్ స్టార్ ప్రభాస్ ఉప్పలపాటి ఫ్యామిలీలో ముద్దుల కుమారుడిగా అందరికీ ఎంతో ఇష్టమైన వాడు. ఇక ఆయన పెళ్లి చూడాలని అభిమానులకంటే కంటే ఎక్కువగా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు కానీ ప్రభాస్ మాత్రం వాయిదా వేస్తూనే ఉన్నాడు. తనకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను అని ఇన్ని రోజులు చెప్పిన ప్రభాస్ ఇప్పుడు మాత్రం ఎక్కువగా సినిమాలతో బిజీ అయిపోయాడు.

ప్రభాస్ ప్రపంచంలో స్నేహితులే ఎక్కువగా

ప్రభాస్ ప్రపంచంలో స్నేహితులే ఎక్కువగా

అయితే ప్రభాస్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంతోకొంత ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. ఎక్కువగా స్నేహితులతో నే ఉంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఆయన స్టాఫ్ లో మొత్తం కూడా స్నేహితులు ఉంటారు. పక్కనే స్నేహితులు ఉంటే నమ్మకంగా ఉపయోగపడతారని ప్రభాస్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ప్రభాస్ కి తగ్గట్టుగానే అందరూ ఆలోచిస్తూ ఉంటారు.

ఉమ్మడి కుటుంబంతో ప్రభాస్

ఉమ్మడి కుటుంబంతో ప్రభాస్

అయితే ప్రభాస్ ఈ బిజీ షెడ్యూల్ లో ఫ్యామిలీతో కూడా అప్పుడప్పుడు సమయాన్ని కేటాయిస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ ఉమ్మడి కుటుంబంతో దిగిన ఒక ప్రత్యేకమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెదనాన్న పెద్దమ్మతో పాటు అక్కలు చెల్లెల్లు భావాలు మరదళ్ళు తమ్ముళ్లు అన్నయ్యలు బాబాయ్ లు పిన్నిలు అందరి మధ్యలో ప్రభాస్ చాలా సింపుల్ గా కనిపించి స్మైల్ ఇచ్చాడు.

శ్యామాల దేవి స్పెషల్ పోస్ట్

శ్యామాల దేవి స్పెషల్ పోస్ట్

కృష్ణంరాజు సతీమణి శ్యామాల దేవి సోషల్ మీడియాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. డాటర్స్ డే సందర్భంగా అందరూ ఒకసారి ప్రత్యేకంగా కలుసుకున్నారట. ప్రభాస్ కూడా మళ్ళీ బిజీగా ఉంటాడేమో అని అందరూ ఒకసారి కలుసుకున్నారట. ఇక ఈ ఉమ్మడి కుటుంభంలో ప్రభాస్ చాలా సరదాగా కనిపించి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

Recommended Video

Prabhas Launched Kalakhar Teaser కళాకార్ టీజర్ లాంచ్ | Rohith
వరుసగా పాన్ ఇండియా సినిమాలు

వరుసగా పాన్ ఇండియా సినిమాలు

ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ముందుగా రాధేశ్యామ్ 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సలార్, ఆదిపురుష్ ప్రాజెక్టులు కూడా 2022లోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. అంతే కాకుండా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ వంటి బడా సంస్థలకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X