పిఠాపురంలో వార్ వన్ సైడే.. పవన్ కల్యాణ్ మెజార్టీ ఎంతో చెప్పేసిన ప్రభాస్ పెద్దమ్మ!

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అందరి నోట ఒకటే మాట.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంత మెజారిటీతో గెలుస్తారు. అభిమానులు, ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్రం రికార్డు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరి అంచనాలకు మించి పవన్ కల్యాణ్ విజయంపై ప్రభాస్ పెద్దమ్మ, స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి జోస్యం చెప్పారు. ఆమె చెప్పిన, మాట్లాడిన మాటల వివరాల్లోకి, పిఠాపురంపై దేశవ్యాప్తంగా ఉన్న దృష్టి గురించిన వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల దృష్టి మొత్తం ఉంది. గత ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి చవి చూసిన పవన్ కల్యాణ్ ఈ సారి ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తున్నారనే ఆసక్తి నెలకొన్నది. అందరూ పవన్ కల్యాణ్ విజయంపై భారీ అంచనాలు పెంచుకొన్నారు.

Prabhas Big Mother Shyamala Devi Predicts Record Majority for Pawan Kalyan in Pithapuram

ఇప్పటికే చాలా మంది వివిధ ప్రాంతాల్లో ఉంటున్న పిఠాపురం వాసులు అక్కడికి చేరుకొంటున్నారు. ఈ సారి ఓటు తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తమ ప్రాంతానికి పోటెత్తారు. దాంతో ఈసారి పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో రికార్డు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రభాస్ పెద్దమ్మ మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలకు కోరేదేమిటంటే.. వార్ వన్ సైడ్ ఉండాలి. పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం. అయితే ఎంత మెజారిటీతో గెలుస్తాడనేది చర్చ జరుగుతుంది. పిఠాపురం అత్యధిక మెజారిటీతో గెలుపు ఖాయమని ప్రజలు ఫోన్లు చేస్తున్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చే మెజారిటీ రాష్ట్రంలోనే నంబర్ వన్ అవుతుంది అని శ్యామలా దేవీ అన్నారు.

Prabhas Big Mother Shyamala Devi Predicts Record Majority for Pawan Kalyan in Pithapuram

పవన్ కల్యాణ్‌కు రికార్డు మెజారిటీ వస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. జై మోదీ గారు.. జై తెలుగుదేశం, జై జనసేన అంటూ విక్టరీ సింబల్ చూపిస్తూ శ్యామల దేవీ నినాదాలు చేశారు. ఆమె ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. పిఠాపురంలోని కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆమె కొద్దిసేపు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X