twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas Birthday: మర్యాద పురుషోత్తముడిగా ప్రభాస్.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గా కొత్త పోస్టర్

    |

    సినీ ప్రేక్షకులకు తమ ఫేవరేట్ హీరోలే దేవుళ్లు. వాళ్ల కోసం ఏ పని చేయడానికైన సిద్ధపడతారు. అన్న అని పిలుస్తూ వారి అభిమానాన్ని చాటుతారు. తమ అభిమాన హీరోల సినిమాలు హిట్ అయితే పొంగిపోతారే తప్పా.. ఫ్లాప్ అయితే మాత్రం కోపగించుకోరు. తర్వాత హిట్ కొట్టే మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అలా ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆయన్ను ఫ్యాన్స్ అందరూ డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. తమ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ వస్తుందంటే చాలు ఎగిరిగంతేస్తారు. ఒక్క అప్డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక అతని బర్త్ డేనే వస్తే. ప్రభాస్ పుట్టిన రోజు వస్తే చాలు డార్లింగ్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే. ప్రభాస్ అభిమానుల కోసం బుజ్జిగాడి పుట్టినరోజు సందర్భంగా ఆదిపురుష్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

    ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా..

    ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా..

    దివంగత కష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినీ రంగంలోకి యంగ్ రెబల్ స్టార్ గా అడుగుపెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ మూవీతో తెరంగేట్రం చేసిన డార్లింగ్ ప్రభాస్ జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రంతో ఆకాశమంతా స్టార్ డమ్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక అప్పటినుంచి ప్రభాస్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియాగానే ప్లాన్ చేస్తున్నాడు. కానీ పాన్ ఇండియాగా వచ్చిన సాహో, రాధేశ్యామ్ ప్రభాస్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక ఇప్పుడు డార్లింగ్ అభిమానులంతా ఆశలు పెట్టుకుంది ఆదిపురుష్ చిత్రంపైనే. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆదిపురుష్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

    కొత్తగా లేని పోస్టర్..

    కొత్తగా లేని పోస్టర్..

    అయితే.. ఇది వరకే ఆదిపురుష్ నుంచి ప్రభాస్ లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ లో ప్రభాస్ రాముడిలా ఎలా కనిపిస్తాడో చూపించారు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కొత్తగా ఏం లేదు. కానీ స్టిల్ కొత్తగా ఉంది. అలాగే ఈ పోస్టర్ కు మంచి క్యాప్షన్ ను జత చేసింది చిత్ర యూనిట్. చేతిలో విల్లు, వెనక బాణాలు, వానర సైన్యంతో ఉన్న పోస్టర్ లుక్ బాగుంది. ఈ పోస్టర్ తో పాటు ఆదిపురుష్ విడుదల తేదిగా జనవరి 12, 2023ను ఖరారు చేశారు.

    మర్యాద పురుషోత్తముడు ప్రభాస్..

    ఇక ఈ పోస్టర్ కి 'మర్యాద పురుషోత్తమ ప్రభు శ్రీ రామ్' అని క్యాప్షన్ ఇచ్చారు. అంటే నిజ జీవితంలో కూడా ఇతరులకు ప్రభాస్ ఎంతో గౌరవం ఇస్తూ మర్యాదగా చూసుకుంటారు. ఇక ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పోస్టర్ వైరల్ కాగా డార్లింగ్ అభిమానులు 'మర్యాద పురుషోత్తముడు ప్రభాస్' అంటూ పిలుచుకుంటున్నారు. ఇక ఆదిపురుష్ సినిమా విషయానికొస్తే రామాయణం గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తే.. సీతగా బ్యూటిఫుల్ హీరోయిన్ కృతీ సనన్, లంకేశ్వరుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులతోపాటు అభిమానులను సైతం నిరాశపరిచింది.

    English summary
    Pan India Star Prabhas Starrer Adipurush Movie New Poster Released On The Occasion Of His Birthday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X