ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. రాధేశ్యామ్ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్‌

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. ఈ సినిమాతో ఎలాగైనా ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక సినిమా నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ అయితే ప్రమోషన్స్ విషయంలో చాలా ఆలస్యంగా అడుగులు వేస్తున్నట్లు అనేక రకాల కామెంట్స్ వచ్చాయి. అప్డేట్స్ ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యు.వి.క్రియేషన్స్ ను బ్యాన్ చేయాలి అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఒక ట్యాగ్ ను కూడా ట్రెండ్ అయ్యేలా చేశారు. ఆ విషయంలో ప్రభాస్ కూడా నిర్మాతలపై కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చేసింది.

భారీ బడ్జెట్ తో...

భారీ బడ్జెట్ తో...

జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెండవ సినిమా చేయడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నాడు. సాహో సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడే ఈ దర్శకుడితో ప్రభాస్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. చాలా కాలం పాటు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న రాధాకృష్ణ మొత్తానికి సినిమాను కూల్ గానే మొదలు పెట్టాడు. మొదట తక్కువ బడ్జెట్ లోనే నిర్మించాలని అనుకున్నారు. కానీ పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ 200కోట్లకు పైగా బడ్జెట్ ను కేటాయించారు. సరికొత్త ప్రేమ కావ్యాన్ని చూపించబోతున్న ట్లు ఇదివరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

 అదొక్కటే రిలీక్ చేశారు

అదొక్కటే రిలీక్ చేశారు

రాధేశ్యామ్ సినిమాపై ప్రస్తుతం అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఇంతవరకు సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రేమ కథ అని చెబుతున్నారు కానీ అది ఎలా ఉంటుంది అనే విషయం లో కూడా పెద్దగా అంచనాలను క్రియేట్ చేయలేదు. ఆ మధ్య కాలంలో ఒక మోషన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. కానీ సినిమాకు సంబంధించిన విశేషాలను పెద్దగా అభిమానులకు తెలియజేయలేదు.

స్పెషల్ టీజర్

స్పెషల్ టీజర్

సినిమా మీద మరింత అంచనాలను క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇటీవల చిత్రయూనిట్ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ టీజర్ ను ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ నెల 23న ప్రభాస్ 42వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా సినిమాతో ప్రభాస్ భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని ఓ వర్గం అభిమానులు నమ్మకంతో ఉన్నారు

Recommended Video

Romantic Trailer | Prabhas Praises Akash Puri And Ketika Sharma
గతంలో ఎప్పుడు లేని విధంగా..

గతంలో ఎప్పుడు లేని విధంగా..

టీజర్ ఎలా ఉండబోతోంది అంటే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంగ్లీష్ లో ప్రభాస్ డైలాగ్స్ చెప్పబోతున్నాడట. అలాగే సబ్ టైటిల్స్ కూడా ఇస్తారని తెలుస్తోంది. అన్ని వర్గాల వారికి అర్థమయ్యేలా ఈ టీజర్ ను విడుదల చేయబోతున్నారట. బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని తెలుస్తోంది. గతంలో అయితే ఏ సినిమా టీజర్ కూడా ఈ తరహాలో రాలేదని చెబుతున్నారు. మరి ఆ టీజర్ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X