Krishnam Raju No More: ఆ హీరో రాగానే మరింత ఏడ్చిన ప్రభాస్.. భుజం మీద చేయి వేసి గంటలపాటు..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం రోజు తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త గురించి తెలియగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలో ప్రభాస్ గతంలో ఎప్పుడు లేనంత కంటతడి పెడుతూ కనిపించాడు. అయితే అతన్ని ఓదార్చేందుకు టాలీవుడ్ హీరోలు కూడా తరలివచ్చారు. ఇక ఈ తరుణంలో ప్రభాస్ ఒక స్నేహితుడని చూసిన తర్వాత మాత్రం మరింత భావోద్వేగానికి లోనయ్యాడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

స్టార్స్ నివాళులు

స్టార్స్ నివాళులు

సినీ ప్రముఖులు కృష్ణంరాజు భౌతికకాయానికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నారు. మొదట కొంతమంది సినీ ప్రముఖులు హాస్పిటల్లో ఉన్నప్పుడే పరామర్శించారు. ఇక తర్వాత కృష్ణంరాజు మరణించినట్లు తెలియగానే వెంటనే వారి స్వగృహానికి వెళ్లే భౌతికకాయానికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ఫ్యాన్స్ ను కంటతడి పెట్టిస్తున్నాయి.

మెగాస్టార్, మహేష్..

మెగాస్టార్, మహేష్..

ఎంతో హుందాగా నిజమైన రాజు అనే తరహాలో నవ్వుతూ కనిపించే కృష్ణంరాజు ఒక్కసారిగా తనువు చాలించడం అందరిని కలచివేస్తోంది. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు మోహన్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలాగే మరికొందరు స్టార్ హీరోలు కూడా ప్రత్యేకంగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు.

ప్రభాస్ కు తీరని లోటు..

ప్రభాస్ కు తీరని లోటు..

ప్రభాస్ కొన్ని గంటల తరబడి పెదనాన్న భౌతికకాయం దగ్గర నిలబడి ఉన్న విజువల్స్ కూడా వారి అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్ మొదలై ఒక ట్రాక్లోకి వెళుతుందన్న సమయంలోనే తన తండ్రి మరణం తీవ్ర దుఃఖానికి గురి చేసింది. ఇక తర్వాత కృష్ణంరాజు ప్రభాస్ ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటూ అతనికి ఎంతగానో అండగా నిలిచాడు. ఇక ఇప్పుడు అలాంటి అండ లేకపోవడం ప్రభాస్ కు తీరని లోటు.

 ప్రభాస్ వద్దే స్నేహితులు

ప్రభాస్ వద్దే స్నేహితులు

ప్రభాస్ కు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సన్నిహితంగా ఉంటారు. అతనికి అందరికంటే ఎక్కువగా స్నేహితులు ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇలాంటి కఠిన సమయంలో ప్రభాస్ ని స్నేహితులు వదిలిపెట్టలేదు. ముఖ్యంగా ప్రభాస్ కు అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అయినా గోపీచంద్ కూడా మొదటి నుంచి ప్రభాస్ దగ్గరే ఉన్నాడు.

గోపిచంద్ రాగానే

గోపిచంద్ రాగానే

అయితే గోపీచంద్ రాగానే ప్రభాస్ మరింత ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే ప్రభాస్ కుటుంబంతో కూడా గోపీచంద్ కు ప్రత్యేకమైన అనుభవం ఉంది. వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే మంచి స్నేహితులు ఇక తరచుగా గోపీచంద్ కూడా కృష్ణంరాజు ఇంటికి వచ్చి ప్రభాస్ అలాగే వారి కుటుంబ సభ్యులలో ఒకటిగా కలిసిపోతూ వచ్చాడు. ఇలాంటి తరుణంలో కృష్ణంరాజు మరణించడం గోపీచంద్ కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.

స్నేహితుడికి బాధను చెప్పుకుంటూ..

స్నేహితుడికి బాధను చెప్పుకుంటూ..

ఇక గోపీచంద్ రాగానే ప్రభాస్ మరింత ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టాడు. గోపీచంద్ కూడా ఎక్కువ సేపు వరకు ప్రభాస్ తోనే కనిపించాడు. ఇక ఎంతో మంది అతిధులు వస్తూ వెళుతూ ఉన్నా కూడా గోపీచంద్ అక్కడే ఉన్నాడు. ఇక గోపి ప్రభాస్ గోపీచంద్ పై చేయి వేసి తన బాధను స్నేహితుడితో చెప్పుకుంటూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇరు వర్గాల అభిమానులను మరింత కంటతడికి గురిచేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X