చిరంజీవి, రజినీకాంత్ నుంచే అలవర్చుకున్నా.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు, తమిళ భాషల్లో చిరంజీవి, రజినీకాంత్ సినిమా ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ పాపులారిటీ తెచ్చుకొని ఇండస్ట్రీ రారాజుల్లా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగి ఉండటంలో కూడా వీరిని మించిన స్టార్స్ లేరనే చెప్పుకోవాలి. ఇక దర్శకుల్లో అయితే రాజమౌళి కూడా అంతే. పాపులారిటీ చూసుకొని పొంగిపోవడం వీరికి అస్సలు తెలియదు. అశేష అభిమాన వర్గమున్నప్పటీకీ ఏ మాత్రం గర్వం లేకుండా సింప్లిసిటీ ప్రదర్శిస్తుంటారు ఈ ముగ్గురూ.
నేటి హీరోల్లో ప్రభాస్ కూడా అదే దారిలో వెళుతూ భారీ క్రేజ్ కొట్టేశారు. బాహుబలి సిరీస్ అందించిన విజయం ఆయన్ను వరల్డ్ స్టార్ చేసేసింది. దీంతో ఎక్కడికెళ్లినా మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. వరల్డ్ స్టార్‌గా ఎలా ఫీల్ అవుతున్నారు అనే ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు ప్రభాస్. ఈ నేపథ్యంలోనే తాజాగా సాహో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఇదే ప్రశ్నపై స్పందిస్తూ.. చిరంజీవి, రజినీకాంత్, రాజమౌళి ప్రస్తావన తీసుకొచ్చారు. ''చిరంజీవి, రజనీకాంత్, రాజమౌళి తమ సినీ కెరీర్‌లో నాకంటే ఎన్నో గొప్ప విజయాలు చూశారు. అయినా వాళ్ళు ఎంతో ఒదిగి ఉన్నారు. అదే రీతిలో విజయం నా లైఫ్ స్టైల్‌పై ఏ మాత్రం ప్రభావం చూపదు. వీరి దగ్గరే నేను ఒదిగి ఉండటం నేర్చుకున్నా'' అన్నారు ప్రభాస్.

ప్రభాస్ తాజా సినిమా సాహో ఆగస్టు 30 న విడుదలకు సిద్ధమైంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











