ప్రభాస్ గొప్పమనసు.. మరోసారి ముందుకొచ్చిన రెబల్ స్టార్.. ఈ సారి ఎంతిచ్చాడంటే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తనలోని మంచి మనసును బయటపెట్టారు. దేశాన్ని కుదిపేస్తున్న కరోనా కట్టడిలో తానూ భాగమవుతానని, సినీ కార్మికుల బాగు కోరుకుంటానని పేర్కొంటూ తన విరాళాన్ని ప్రకటించారు. ఇది చూసి ఆయన అభిమాన వర్గం ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వివరాల్లోకి పోతే..

విజృంభిస్తున్న కరోనా.. టాలీవుడ్ అండదండ
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల్లో భాగం పంచుకుంటూ గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు టాలీవుడ్ స్టార్స్. తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తూ దాతృత్వం చూపిస్తున్నారు. అటు కేంద్రం ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

దేశమంతా లాక్‌డౌన్.. కార్మికుల దుస్థితి
దేశ ప్రజలంతా ఏప్రిల్ 15 దాకా లాక్‌డౌన్ పాటించాలని ప్రధాని ఇచ్చిన ఆదేశాల మేరకు దేశం లోని అన్ని రంగాలు మూత పడ్డాయి. దీంతో డబ్బుల్లేక కార్మికులు ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం పలు సహాయక చర్యలు చేపడుతోంది.

ప్రభాస్ 4 కోట్లు.. సినీ కార్మికులను ఆదుకునేందుకు గాను చిరంజీవి!
ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించగా, రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా 4 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ తర్వాత సినీ కార్మికులను ఆదుకునేందుకు గాను చిరంజీవి ఆద్వర్యంలో 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటుచేసి సినీ రంగంలోని కార్మికులను ఆదుకుంటున్నారు.
Recommended Video

మరోసారి ముందుకొచ్చిన రెబల్ స్టార్..
ఈ నేపథ్యంలో 'కరోనా క్రైసిస్ ఛారిటీ'కి తన వంతు సాయం అందిస్తూ మరోసారి ముందుకొచ్చారు ప్రభాస్. 'కరోనా క్రైసిస్ ఛారిటీ'కి గాను 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. దీంతో కరోనా కల్లోలంలో సహాయార్థం ప్రభాస్ అందించిన సాయం 4.5 కోట్లు అయింది.


Click it and Unblock the Notifications











