Prabhas: భద్రాద్రి రాముడికి ప్రభాస్ విరాళం.. ఆయన పేరు మీద అన్ని లక్షలు
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. అందులో అందరి కంటే ముందే ఈ పేరును సంపాదించుకున్నది మాత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రంతో నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తోన్నాడు. ఇలా ఇప్పుడు చేతిలో నాలుగైదు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇక, ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. ఈ చిత్రంపై ఆది నుంచే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తోన్న 'ఆదిపురుష్' సినిమా రామాయణం నేపథ్యంతో చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే కాన్సెప్టుతో రూపొందింది. ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇలా ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్.. ఓ మంచి పని చేసి అందరి మన్ననలు పొందుతోన్నాడు.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో శ్రీరాముడి పాత్రను చేశాడు. ఈ నేపథ్యంలో దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం రామాలయానికి ఈ స్టార్ హీరో రూ. 10 లక్షలు విరాళం ప్రకటించాడు. తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరిట ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును ప్రభాస్ తరఫున ఆయన బంధువులు శనివారం దేవస్థానం ఈవో ఎల్ రమాదేవికి అందజేశారు. దీంతో రామాలయంలోని ప్రధాన అర్చకులు ప్రభాస్ పేరిట స్వామి వారికి పూజలు నిర్వహించడంతో పాటు 'ఆదిపురుష్' మూవీ విజయం సాధించాలని ఆశీర్వదించారు.
ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా హనుమంతుడిగా చేస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి అజయ్ - అతుల్ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











