రాధేశ్యామ్ నుంచి మరో ఆసక్తికరమైన లీక్.. ప్రభాస్ ఏడవకుండానే ఏడిపిస్తాడట!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అందరి చూపు కూడా ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల వైపే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద సినిమాలు ఎక్కువగా లేకపోవడం తో రాబోయే రెండు పాన్ ఇండియా సినిమాలు మనవే కావడం విశేషం. దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమా అందరికంటే ముందుగానే 2022 ని ఉహించని విధంగా స్టార్ట్ చేస్తారు అని అర్థమవుతోంది. ఇక ఆ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సరికొత్త ప్రేమ ప్రపంచం లోకి
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఒక మంచి లవ్ స్టోరీ లాంటి సినిమాలు చూసి చాలా కాలం అయింది. గతంలో మాస్ సినిమాలు చేస్తు వచ్చిన ప్రభాస్ మధ్యలో లవ్ స్టోరీలను కూడా చేసుకుంటూ వచ్చేవారు. ఇక ప్రభాస్ బాహుబలి సినిమా అనంతరం మళ్లీ అలాంటి జానర్లో వెండి తెరపై కనిపించలేదు. ఇక రాధేశ్యామ్ సినిమాతో మాత్రం తప్పకుండా సరికొత్త ప్రేమ ప్రపంచం లోకి తీసుకు వెల్తాడు అని అర్థమవుతుంది.

నమ్మకం అయితే ఉంది.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధేశ్యామ్ సినిమాకు దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహించగా యు.వి.క్రియేషన్స్ గోపికృష్ణ బేనర్లో భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా బాగానే చేస్తున్నారు.

ఎమోషన్స్ కూడా
ఇక సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా 24 గంటల్లోనే పాత రికార్డులను బ్రేక్ చేసి అత్యధికంగా వ్యూవ్స్ అందుకుంది. సినిమాలోని విజువల్స్ తో పాటు ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకు ఊహలకందని విధంగానే ఉంటాయట.

ప్రేక్షకులను ఏడిపిస్తాడట.
అయితే ప్రభాస్ ఒక సన్నివేశంలో ఎడవకుండానే ప్రేక్షకులను ఏడిపిస్తాడట. సాధారణంగా ఒక ఎమోషనల్ సన్నివేశం వచ్చినప్పుడు ఆ సన్నివేశం లో తప్పకుండా ఎడవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దర్శకుడు రాధాకృష్ణ మాత్రం అంత పెద్ద స్టార్ హీరో ఏడిపించ కుండానే ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రజెంట్ చేయాలని అనుకున్నాడట.

చనిపోయే సన్నివేశం..
హీరోయిన్ చనిపోయే సన్నివేశం కూడా ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుందని ఇప్పటికే కొన్ని కథనాలు హాట్ టాపిక్ గా మారాయి. ఒక సముద్రపు అలల మధ్యలో చిక్కుకున్న తర్వాత హీరో హీరోయిన్ కూడా చనిపోతారు అని కూడా చెబుతున్నారు. ఇక వాటిపై క్లారిటీ రావాలంటే తప్పకుండ సినిమా చూడాల్సిందే అయితే ఒక ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం ప్రభాస్ ఏడవకుండా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాడని తెలుస్తోంది.

ప్రభాస్ హ్యాపీ..
సినిమాకి సంబంధించిన ఫైనల్ కట్ కూడా చూసి ప్రభాస్ చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లు సమాచారం. కొన్ని సన్నివేశాలను కూడా మళ్ళీ రీ షూట్ చేసిన విధానం ఆయనకు ఎంతగానో నచ్చాయి. తప్పకుండా సినిమా ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











