అభిమానులే శత్రువులయ్యారు.. ఇంత జరుగుతుంటే ప్రభాస్ ఏం చేస్తున్నాడు?
అభిమానుల మనసును గెలుచుకోవాలి అంటే కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలని సినీ వర్గాల్లో వినిపించే మాట. ఇక ఒక్కసారి స్టార్ హీరోకి క్రేజ్ ఏర్పడితే అభిమానులకు నచ్చినట్లే సినిమాలు చేయాలి. ఎన్ని విషయాల్లో మార్పులు వస్తున్నా అభిమానుల ఆవేశంలో మాత్రం మార్పు రావడం లేదు. మాస్ ఆడియెన్స్ ఎంతగా అభిమానిస్తారో అంతకంటే ఎక్కువగా కూడా ద్వెషిస్తారు. వారి అభిమాన హీరోని ఏమైనా అన్నప్పుడు వారి కోపం కట్టలు తెచ్చుకుంటుంది.

ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహజ్వాల..
అభిమానులు అవేశపడటానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే అందులో ముఖ్యంగా సినిమాల అప్డేట్స్ పై క్లారిటీ ఇవ్వకపోవడం ఒకటి. మిగతా హీరోలు వారి ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఫస్ట్ లుక్ లు టీజర్ లు రిలీజ్ చేస్తుంటే.. ప్రభాస్ టీమ్ మాత్రం చాలా నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఫ్యాన్స్ ఆగ్రహంపై ఒక లుక్కేస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎంతగా అంటే.. అప్డేట్ ఇస్తారా ఇవ్వరా అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో విప్లవాన్ని మొదలుపెట్టారు.

ప్రభాస్ పట్టించుకోడా?
ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త తరహా లుక్ తో ప్రభాస్ దర్శనమివ్వనున్నట్లు రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది గాని అఫీషియల్ గా ఎలాంటి ఎనౌన్స్మెంట్ రావడం లేదు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కనీసం ప్రభాస్ బాధ్యత తీసుకొని సినిమా అప్డేట్ ఇస్తాడనుకుంటే.. అది కూడా కనిపించడం లేదు.

యూవీ క్రియేషన్స్ ని బ్యాన్ చేయాలి..
యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సెట్స్ పైకి తెచ్చి రెండేళ్లవుతోంది. సాహూ సినిమా అభిమానుల అంచనాలను అందుకోకపోవడంతో నెక్స్ట్ సినిమాతో అయినా యువి సంస్థ మంచి కిక్కిస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ వస్తున్న అభిమానులకు చివరికి ఓపిక నశించేలా కనిపిస్తోంది. కనీసం టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేసిన టైటిల్స్ ని కూడా మరొకరు వాడేసుకొని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో యువి క్రియేషన్స్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
Recommended Video

ఇలా అయితే కష్టమే..
ప్రభాస్ సినిమా అప్డేట్ ఇవ్వలేదని ఫ్యాన్స్ #banuvcreations అంటూ హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు. దాదాపు 40వేలకు పైగా ట్వీట్లు పడ్డాయంటే అభిమానుల ఆగ్రహం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే ఫ్యూచర్ లో ప్రభాస్ యువి క్రియేషన్స్ లో సినిమా చేయడం కష్టమే అని తెలుస్తోంది. అభిమానులే వారిని అడ్డుకునేలా కనిపిస్తోంది. మరి ఈ విషయంపై ప్రభాస్ ఎదో ఒక ఆలోచనకు వచ్చి ఫ్యాన్స్ ని కూల్ చేస్తే బెటర్.. లేకుంటే యువి సంస్థ ముందు అభిమానులు దీక్ష చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications











