Kannappa : షాకిచ్చేలా ప్రభాస్ లుక్ .. కన్నప్ప లుక్‌పై డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా

ప్రస్తుతం మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో తండ్రీకొడుకులు, అన్నాదమ్ముల మధ్య గొడవలు పతాక స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. పోలీస్ కేసులు, కోర్టు ఆదేశాలు, బల ప్రదర్శనలు దాటి విషయం ఎక్కడికో వెళ్తోంది. ఈ గొడవలో ఈ ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కన్నప్ప చిత్రం కూడా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాపై గొడవలు ప్రభావం పడి కన్నప్ప షూటింగ్ ఆలస్యంగా జరుగుతోందని.. షూటింగ్ కూడా పోస్ట్‌పోన్ అయినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇంత జరుగుతున్నా మంచు విష్ణు మాత్రం సినిమాను దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్నాడు.

మహాభారత్ సిరీస్ తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో కన్నప్పను మంచు ఫ్యామిలీ నిర్మిస్తోంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు దేశంలోని అన్ని పరిశ్రమలకు చెందిన నటీనటులను ఇందులో భాగం చేస్తూ ప్లాన్డ్‌గా వెళ్తున్నాడు విష్ణు. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Prabhas fans are furious over his Rudra look in the movie Kannappa and are trolling Manchu Vishnu

సినిమాపై హైప్ తగ్గకుండా టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఊపు తెస్తున్నాడు విష్ణు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడో అనౌన్స్ చేసింది. దీంతో ప్రభాస్ లుక్, గెటప్ ఎప్పుడెప్పుడు వస్తాయోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. తొలుత శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తారని అనుకున్నా బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌ ఈ పాత్ర పోషిస్తున్నట్లు చెబుతూ ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

దీంతో ప్రభాస్ పాత్ర ఏంటీ ? అంటూ డార్లింగ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ సోమవారం ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేశారు. ది మైటీ రుద్ర అంటూ కన్నప్పలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపిస్తున్నట్లు తెలిపాడు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అని ప్రభాస్‌ను పరిచయం చేశారు. చేతిలో కర్ర పట్టుకుని , నుదిటిన విభూతి రాసుకుని, ఒళ్లంతా రుద్రాక్షలతో దర్శనమిచ్చాడు ప్రభాస్.

ప్రస్తుతం ప్రభాస్ రుద్ర గెటప్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు, డార్లింగ్ అభిమానులు మిశ్రమంగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రభాస్ అభిమానులకు మాత్రం ఈ లుక్ పోస్టర్‌పై డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్‌పై భారీగా కామెంట్స్ పోస్టు చేస్తు వైరల్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: kannappa manchu vishnu prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X