జై జగన్ అంటూ యువకుడు నినాదం.. చితకబాదిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఆదిపురుష్ ఈవెంట్ వీడియో వైరల్
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొన్న చిత్రం ఆదిపురుష్. వాల్మికీ రామాయణంలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు పెంచింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సీరిస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఓం రావత్ నిర్మించిన ఈ చిత్రం అట్టహాసంగా జూన్ 16వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొన్ని ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకొన్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంఘటన వివరాల్లోకి వెళితే..
తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూవీ క్రియేషన్స్ అట్టహాసంగా నిర్వహించింది. ఈ పండగలా ఈ కార్యక్రమాన్ని మార్చేందుకు హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగాడు. ఈవెంట్ కాన్సెప్ట్‌ను అద్బుతంగా డిజైన్ చేశాడు. దాంతో ఈ వేడుకకు భారీ స్పందన లభించింది.

ఇక ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అంచనాకు మించి అభిమానులు తరలి వచ్చారు. చిత్తూరు జిల్లాలతోపాటు రాయలసీమలోని జిల్లాల నుంచి పొటేత్తారు. అంతేకాకుండా తమిళనాడు నుంచి కూడా భారీగా హాజరయ్యారు. స్టేడియంలో కంటే రెండింతల మంది అభిమానులు బయటే ఉండాల్సి వచ్చింది. పోలీసులు ఎక్కడి వాహనాలు అక్కడే ఆపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది.

అయితే రోడ్లపైనే కాకుండా స్టేడియంలో ప్రభాస్ అభిమానులు జోష్‌తో కనిపించారు. అయితే రోడ్డుపై ఓ యువతిని వేధించారనే కారణంతో ఆ అమ్మాయి తండ్రి, ఆయన కుటుంబ సభ్యులు యువకుడిని చితకబాదారు. యువకుడిని అమ్మాయి తండ్రి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రంజుగా సాగుతుండగా.. ప్రభాస్ అభిమానులు బాహుబలి.. జై శ్రీరాం అంటూ అభిమానులు నినాదాలతో ఈవెంట్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. చిన జీయర్ స్వామి ప్రసంగిస్తుండగా జై శ్రీరాం.. బాహుబలి అంటూ ఆయన ప్రసంగానికి జోష్ కలిగించారు. ఇలా అభిమానులు ఆద్యంతం ఉత్సాహంతో ఈవెంట్‌ను పండుగ మాదిరిగా కొనసాగించారు.
ఆదిపురుష్ ఈవెంట్ జోష్, ఉత్సాహంతో కొనసాగుతుండగా.. జై జగన్.. జై జగన్ అంటూ యువకుడు నినాదాలు చేశారు. దాంతో ఆగ్రహం చెందిన ప్రభాస్ అభిమానులు


Click it and Unblock the Notifications











