ప్రభాస్ ఎవడో తెలియదా .. షర్మిలకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రెబల్స్
సినీ రంగానికి చెందిన హీరోలు అలాగే హీరోయిన్స్ విషయంలో అవి నిజమవ్వనీ అబద్దం అవ్వనీ కొన్ని రూమర్స్ అయితే తమ పర్శనల్ లైఫ్ లకి సంబంధించి ఎప్పటికప్పుడు అలా వినిపిస్తూనే ఉంటాయని చెప్పాలి. దాదాపు ఇది స్టార్ హీరోలు, హీరోయిన్స్ విషయంలో కనిపిస్తుంది. అలా మన తెలుగు సినిమాకి చెందిన స్టార్ హీరోల విషయంలో కూడా చాలా పుకార్లు ఉన్నాయి.
అయితే ఇప్పుడు మారిన ట్రెండ్ ఏమో కానీ కొన్నేళ్ల కితం అయితే రాజకీయాలకు సంబంధించి కూడా పలు షాకింగ్ వ్యక్తులతో అఫైర్స్ అంటూ ఏవేవో వినిపించేవి. ఈ కోణంలో అయితే పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలపై వచ్చిన పుకార్ల గురించి తెలియని వారు ఉండరు. ఇద్దరి విషయంలో చాలానే షాకింగ్ అంశాలు వినిపిస్తూ వచ్చాయి.

కానీ వీటిపై ప్రభాస్ ఎక్కడా స్పందించలేదు కానీ షర్మిల మాత్రం అప్పట్లో బాలకృష్ణ ఆఫీస్ నుంచే ఇవన్నీ వచ్చాయి అంటూ కామెంట్స్ చేసింది. మళ్ళీ సడెన్ గా ఇపుడు షర్మిల, ప్రభాస్ ల పుకార్లు మళ్ళీ వినిపిస్తున్నాయి. కాగా ఈసారి స్వయంగా షర్మిల మాట్లాడ్డం అది కూడా తన అన్న , ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఆరోపణలు చేస్తూ చెప్పడం బాగానే ఉంది . కానీ ప్రభాస్ విషయంలో మాత్రం నోరు జారి అందరికీ షాకిచ్చింది అని చెప్పాలి.
ప్రభాస్ 'ఎవడో' నాకు తెలీదు ఇపుడు వరకు చూడలేదు అంటూ ఏక వచనంలో మాట్లాడ్డం అనేది ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. తమ హీరోతో పర్శనల్ లైఫ్ అవీ ఎంత వరకు నిజమో కానీ మీకు ప్రభాస్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ మీ నాన్న వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రభాస్ ఎవరో బాగా తెలుసు అంటూ గతాన్ని తవ్వి ఫోటోలు పెట్టి మరీ దిమ్మ తిరిగే సమాధానం షర్మిలకి అందిస్తున్నారు.

కాగా ప్రభాస్ వింటేజ్ మూవీస్ లో "యోగి" సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఆ సినిమా ముహూర్త కార్యక్రమం, అసలు ఆ సినిమాకి క్లాప్ కొట్టి మరీ స్టార్ట్ చేసింది స్వయానా స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. ఒక సీఎం చేతులు మీదుగా స్టార్ట్ అయ్యిన సినిమాగా అప్పట్లో యోగి సినిమా హాట్ టాపిక్ గా కూడా నడిచింది.
మరి ఇలాంటిది నీకు ప్రభాస్ ఎవరో తెలీదు అంటే నమ్మాలా? అన్నట్టుగా రెబల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షర్మిల తమ అభిమాన హీరోపై చేసిన కామెంట్స్ కి గాను గట్టి సమాధానం చెబుతున్నారు. మరి దీనిపై షర్మిల మళ్ళీ ఏమన్నా క్లారిటీ ఇస్తుందో లేదో అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం ప్రభాస్ ని ఆమె ఏకవచనంతో మాట్లాడ్డం అనేది డార్లింగ్ ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











