Kalki 2898 AD: హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే, అంతర్జాతీయ స్థాయి సినిమాలు కూడా రూపొందుతోన్నాయి. అలాంటి కోవలోకి వచ్చేదే రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) మూవీ. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ విషయంలో ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

కల్కి 2898 ఏడీతో ప్రభాస్
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సినిమానే 'కల్కి 2898 ఏడీ'. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Prabhas Fans Tension About Kalki 2898 AD Movie Release After Deepika Announces Pregnancy

20 భాషలకు పైగా రిలీజ్
బిగ్ బడ్జెట్‌తో వస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా టైం ట్రావెల్‌ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాను ఏకంగా 20 భాషలకు పైగానే విడుదల చేయబోతున్నారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.

శరవేగంగా మూవీ షూట్
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా చిత్రీకరించి ఇప్పటికే దాదాపుగా టాకీ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన వర్క్‌ను సైతం వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

రిలీజ్ అప్పుడే అంటూ
విజువల్ వండర్‌గా రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మే 9వ తేదీన రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఇది మళ్లీ వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ, చిత్ర యూనిట్ అదే డేట్‌పై ఫోకస్ చేస్తోంది.

Prabhas Fans Tension About Kalki 2898 AD Movie Release After Deepika Announces Pregnancy

తల్లి కాబోతున్న దీపికా
టైం ట్రావెల్ స్టోరీతో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకోణె నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె ఈ సినిమా షూటింగ్‌లో కూడా చాలా వరకూ పాల్గొంటూనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో దీపికా ప్రెగ్నెంట్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, వచ్చే సెప్టెంబర్‌లోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది.

Prabhas Fans Tension About Kalki 2898 AD Movie Release After Deepika Announces Pregnancy

ప్రభాస్ ఫ్యాన్స్‌కు టెన్షన్
దీపికా పదుకోణె తల్లి కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులకు కొత్త టెన్షన్ మొదలైంది. అదే.. ఆమె చేయాల్సిన షూట్ బ్యాలెన్స్ ఉంటే.. ఇప్పుడు ప్రెగ్నెంట్ అవడం వల్ల అది సాధ్యం కాదు. అదే జరిగితే 'కల్కి 2898 ఏడీ' మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పుడిదే అంశం ప్రభాస్ అభిమానులను కలవరపెడుతోంది. మరి చిత్ర యూనిట్ ఏం చెప్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X