ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో తీవ్ర విషాదం.. ఐసీయూలో బాలీవుడ్ యాక్టర్!
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టీ సీరిస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వై రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పాకిస్థానీ నటి ఇమాన్ ఇస్మాయిల్, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, చైత్ర జే ఆచార్, భానుచందర్, ప్రవీణ్, జయప్రద, రాహుల్ రవీంద్రన్, రాజేశ్ శర్మ తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, సందీప్ చటర్జీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎఢిటర్‌గా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అయితే ఈ సినిమా షూటింగులో ఓ విషాద సంఘటన చోటు చేసుకోవడంతో చిత్ర యూనిట్‌లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆ విషాద సంఘటన ఏమిటనే వివరాల్లోకి వెళితే..

గత కొద్దికాలంగా భారీ తారాగణంతో హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలను ప్రభాస్‌పై దర్శకుడు హను రాఘవపూడి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో పాన్ ఇండియా స్థాయిలో నటీనటులు పాల్గొంటున్నారు. అయితే హిందీ సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేశ్ శర్మ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు.
అయితే తాజాగా ఆయన రామోజీ ఫిలిం సిటీలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే షూటింగ్ ముగిసిన తర్వాత టెక్నిషియన్లతో మాట్లాడుతుండగా పురుగు లాంటి జీవి ఆయన పాదంపై కుట్టింది. అయితే ఏదో చీమ, దోమ అనే భావించిన ఆ విషయాన్ని లైట్ తీసుకొన్నారు. కానీ ఆ తర్వాత 6, 7 గంటల తర్వాత ఆయన శరీరం తీవ్ర నొప్పికి గురైంది. హై టెంపరేచర్‌కు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
అయితే తనకు కుట్టింది సాధారణ కీటకం కాదు. విష పురుగు అయి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో హైదరాబాద్ నుంచి కలకత్తాకు బయలుదేరారు. ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా ఆయనకు షుగర్ లెవెల్స్ భారీగా పెరిగి ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో ఆయనను కోల్‌కతాలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ఐసీయూలో చేర్పించారు. కీటకం కుట్టిన కాలికి భారీగా ఇన్‌ఫెక్షన్‌కు గురైంది. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది. కోల్‌కత్తా వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications