Prabhas: ప్రభాస్ సినిమా నుంచి ఫొటోలు లీక్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మేకర్స్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas).. వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ప్రభాస్, ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో 'ఫౌజీ' ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 'సీతారామం' వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే.. ఈ మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ కావడంపై మూవీ మేకర్స్ వార్నింగ్ ఇచ్చారు.

ఫౌజీ సినిమా ఒక భారీ పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతోంది. యుద్ధ నేపథ్యంలోని ఫిక్షనల్ హిస్టారికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్సాన్స్ వస్తుంది. దీంతో తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas Fauzi Leak Mythri Movie Makers Issue Strong Warning Over Viral Set Photos

అయితే.. ఈ సమయంలోనే సినిమా యూనిట్‌కు పెద్ద షాక్ తగిలింది. 'ఫౌజీ' సెట్స్ నుంచి ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గత రెండు రోజులుగా ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఫొటోలు నిజమా? లేక ఏఐ ద్వారా సృష్టించబడినవా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి ఈ ఫోటో నెట్టింట్లో తెగవైరల్ అయ్యింది. దీంతో ఈ అంశంపై మూవీ మేకర్స్ స్పందించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు మేకర్స్. లీకైన ఫొటోలను షేర్ చేస్తున్న అకౌంట్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. 'సెట్స్ నుంచి లీక్ అయిన చిత్రాలను కొన్ని అకౌంట్స్ ప్రచారం చేస్తున్నాయి. దయచేసి దీన్ని గట్టి హెచ్చరికగా పరిగణించండి. ఇలాంటి కంటెంట్‌పై ఫిర్యాదు చేయబడుతుంది. ఇందులో భాగమైన వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటాం' అని స్పష్టం చేశారు.

అలాగే, తాము ఎంతో జాగ్రత్తగా నిర్మిస్తున్న సినిమాటిక్ అనుభూతిని ఈ లీకులు దెబ్బతీస్తున్నాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని, కాబట్టి లీకైన కంటెంట్‌ను షేర్ చేయకుండా సహకరించాలని అభిమానులను కోరారు. మేకర్స్ స్పందనను బట్టి చూస్తే, లీకైన ఫొటోలు నిజమైనవేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో కూడా 'ఫౌజీ' సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ కావడం, అప్పుడు కూడా మేకర్స్ ఇలానే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయినప్పటికీ లీకుల బెడద ఆగకపోవడం మూవీ మేకర్స్ కు సవాల్‌గా మారింది. ఇకపై మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఫౌజీ సినిమా విషయానికి వస్తే, ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తోంది. సీనియర్ నటి జయప్రద, బాలీవుడ్ ప్రముఖులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తుండగా, కమల్ కణ్ణన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వర్తిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న 'ఫౌజీ'కి సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X