రాజమౌళితో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. ఒక ప్లాన్ ఉందని అంటూ.. త్వరలోనే..
నెంబర్ వన్ ఇండియా స్టార్ గా చక్రం తిప్పుతున్న ప్రభాస్ తదుపరి సినిమా రాధేశ్యామ్ తో తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటాడు అని అనిపిస్తోంది. బాహుబలి సాహో సినిమాలతో ప్రపంచ స్థాయిలో మంచి క్రేజ్ అందుకుంటూ వస్తున్న ప్రభాస్ చాలా కాలం తర్వాత చేసిన లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఇక ఈ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మళ్లీ రాజమౌళితో సినిమా ఎప్పుడు చేస్తారు అనే సందేహాలకు ప్రభాస్ ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇంతకు ప్రభాస్ ఏమన్నాడు అనే వివరాల్లోకి వెళితే..

నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెల్లగా తన స్టార్ హోదా ను పెంచుకుంటూ వచ్చిన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. సాహో సినిమా తో కూడా అతని స్థాయి ఏమాత్రం తగ్గలేదని ఓపెనింగ్స్ తో నే క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రభాస్ తో సినిమా చేసేందుకు అగ్ర దర్శకులు ప్రస్తుతం పవర్ఫుల్ కథలను సిద్ధం చేసుకుంటున్నారు.

గ్రాండ్ రిలీజ్..
ఇక అందరి చూపు ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాపైనే ఉంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది నుంచే ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తోంది. ఫైనల్ గా ఈ సంక్రాంతికి వస్తుందని అనుకుంటే కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా మార్చి 25 వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లోనే రాధేశ్యామ్ అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతోంది.

రాజమౌళితో సినిమా..
ఇక సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రభాస్ ప్రమోషన్స్ విషయంలో కూడా స్పీడ్ పెంచేశాడు. ఇటీవల ముంబైలో నిర్వహించిన ఒక ప్రత్యేకమైన ప్రెస్మీట్లో ప్రభాస్ సినిమా గురించి మాత్రమే కాకుండా తన భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా ప్రత్యేకంగా వివరణ ఇచ్చాడు ముఖ్యంగా రాజమౌళి తో కూడా సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

తప్పకుండా అంటూ..
గతంలోనే రాజమౌళి - ప్రభాస్ కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లు గా అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక ఆ విషయంపై స్పందించిన ప్రభాస్ తప్పకుండా తమ కలయికలో మరో సినిమా ఉంటుంది అంటూ ఇదివరకే రాజమౌళి నేను ఒక ప్లాన్ గురించి కూడా చర్చించుకున్నాము అని అన్నాడు. ఒకవేళ అది వర్కౌట్ అయితే తప్పకుండా ఒక సినిమా త్వరలోనే సెట్స్ పైకి వస్తుందని తెలియజేశాడు.

బిజీబిజీగా ప్రభాస్..
ఇక ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో అయితే చాలా సినిమాలు ఉన్నాయి. రాధేశ్యామ్ అనంతరం ఆదిపురుష్, రాధేశ్యామ్ రాబోతోంది. మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్టు K ఇలా వరుసగా సినిమాలు లైన్ లో పెట్టాడు. అంతే కాకుండా మరికొంత మంది బాలీవుడ్ దర్శకులతో అలాగే ప్రశాంత్ నీల్ తో కూడా మరో సినిమా చేసే అవకాశం ఉంది. మరి ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ రాజమౌళి సినిమాతో రావడానికి ఎంత టైం పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











