Project K: భయపడి వెనక్కి తగ్గిన ప్రాజెక్ట్ కె.. ప్రభాస్ అసలు లుక్ ఇదే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె జోడీగా నటిస్తున్న క్రేజీ సినిమా ప్రాజక్ట్ కె. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే బుధవారం రోజున సినిమాలోని ప్రభాస్ లుక్ ప్రాజెక్ట్ కెపై ఉన్న అంచనాలను తారుమారు చేసింది. ఇప్పుడు దాన్ని సరిద్దిద్దుకునేందుకు కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్.

Prabhas First Look From Project K Deleted And Shares New Poster

క్యూరియాసిటీ: జగదేక వీరుడు అతిలోక సుందరి, రాజకుమారుడు, స్టూడెంట్ నెంబర్ 1, ఇంద్ర, దేవదాస్, మహానటి, సీతా రామం వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన ఈ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తాజా సినిమా ప్రాజెక్ట్ కె. భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, మేకింగ్ వీడియోలు మంచి క్యూరియాసిటీ పెంచాయి.

Prabhas First Look From Project K Deleted And Shares New Poster

మరి కాసేపట్లో: సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ను ప్రపంచవేదిక అయిన అమెరికా శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)పై జూలై 20న అంటే ఇవాళ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. మరికాసేపట్లో ప్రాజెక్ట్ కె టైటిల్ ఏంటీ వంటి వివరాలను గ్లింప్స్ వీడియో ద్వారా ప్రపంచానికి చెప్పనున్నారు. దీనికోసం ఇప్పటికే ప్రభాస్, అశ్వనీదత్, కమల్ హాసన్ తోపాటు రానా కూడా అమెరికా చేరుకున్నారు.

Prabhas First Look From Project K Deleted And Shares New Poster

ట్రోలింగ్: ఇదిలా ఉంటే జూలై 19న విడుదల చేసిన ప్రభాస్ లుక్ పై ఫ్యాన్స్, నెటిజన్లు తెగ ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్ కెపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా తారుమారు చేశారుగా అంటూ నిరుత్సాహం చెందారు. అవేంజర్స్ లో ఐరన్ మ్యాన్ లా ప్రభాస్ ఉన్నాడంటూ, ప్రభాస్ తలకు బాడీ ఎవరిదో పెట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. అయితే ఈ విపరీతమైన ట్రోలింగ్ చూసిని నిర్మాణ సంస్థ వెనక్కి తగ్గింది.

ఒరిజినల్ లుక్: నెటిజన్ల ట్రోలింగ్ బారి నుంచి తప్పించుకోవడానికి విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ను డిలీట్ చేసింది నిర్మాణ సంస్థ. దానికి బదలుగా కొత్త లుక్ విడుదల చేసింది. ఈ లుక్ లో ఎలాంటి గ్రాఫిక్స్, పేర్లు లేకుండా ఉన్న అదే పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ కొంచెం క్లియర్ గా, ఒరిజినల్ లా ఉంది. అలాగే గ్లింప్స్ వీడియో కోసం రెడీ అయిపోయిండి అని రాసుకొచ్చారు.

మా రైడర్స్: ప్రభాస్ లుక్ మాత్రమే కాకుండా మరికొన్ని పోస్టులు షేర్ చేసింది వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ. నౌ బిగిన్స్ ది ఎండ్ అనే పోస్టర్లతో మా రైడర్స్ వచ్చేశారంటూ సినిమాలో విలన్స్ గా నటించేవాళ్లను చూపించారు. అలాగే ప్రాజెక్ట్ కె సంబంధించిన కామిక్ పోస్టర్స్ ను కూడా షేర్ చేశారు. దీంట్లో కె అంటే కలియుగ్ అని రాసి ఉంది. అంటే కెకు అసలు అర్థం కలియుగం అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X