Project K Prabhas Lookపై దారుణంగా ట్రోలింగ్.. పెద్ద రాడ్.. అమీర్ పేట్ ఎడిటింగా?

ప్రభాస్.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో విజిల్స్ పడతాయి. అరుపుల కేకలతో థియేటర్లు మారు మోగిపోతాయి. ఈశ్వర్ సినిమా నుంచి ఆదిపురుష్ వరకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు ప్రభాస్. సినిమాల ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ కు కొంచెం అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు.

విడుదలయ్యే ప్రతి సినిమా నిరుత్సాహపరిచిన తర్వాతి మూవీ అయినా అదిరిపోతుందని అభిమానులు ఆశలు పెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా వేల కోట్ల ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ కె మూవీ యూనిట్ కూడా నెక్ట్స్ మూవీపై హోప్స్ పెట్టుకోండి అన్నట్లుగా షాక్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళితే..

Prabhas First Look From Project K Out And Brutally Trolled

భారీ తారాగణం: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె తొలిసారి జత కట్టిన సినిమా ప్రాజక్ట్ కె. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో అగ్ర తారగణం నటించబోతుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ ప్రతినాయకుడిగా మెప్పించనున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

Prabhas First Look From Project K Out And Brutally Trolled

అధికారిక ప్రకటన: విష్ణువు చివరి అవతారం కల్కిగా ప్రభాస్ పాత్ర ఉండబోతున్న ప్రాజెక్టె కె నుంచి విడుదలైన పోస్టర్స్, మేకింగ్ వీడియోలు ఇప్పటికీ ఎంతో క్యూరియాసిటీ పెంచేశాయి. అయితే సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ను ప్రపంచవేదిక అయిన అమెరికా శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)పై విడుదల చేయనున్నారు. జూలై 20న టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికంటే ముందుగా తాజాగా ప్రాజెక్ట్ కెలోని ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

నీళ్ల చల్లి: ఇందులో హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ మూవీ అవేంజర్స్ లో ఐరన్ మ్యాన్ గెటప్ తరహాలో ప్రభాస్ లుక్ ఉంది. ఈ ఫస్ట్ లుక్ విడుదలైన అతి కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది. కానీ, ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లే కాదు అభిమానులతోపాటు సగటు ప్రేక్షకుడు సైతం షాక్ కు గురయ్యాడు.

అది ఫ్యాన్ మేడ్ లుక్ అని మొదటగా భావించి.. అఫిషియల్ లుక్ అని తెలిసి నోరు వెళ్లబెడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల మీద వైజయంతీ మూవీస్ ఒక్కసారిగా నీళ్లు చల్లేసిందని బాధపడుతున్నారు.

Prabhas First Look From Project K Out And Brutally Trolled

అతికించినట్లు: ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల గురించి మిల్లీ సెకన్లతోపాటు ఓ టైమ్ చెప్పారు. తర్వాత కాస్త లేట్ అవుతుందని మళ్లీ ఓ ట్వీట్ చేశారు. సరే అనుకుని ఎదురు చూసిన అభిమానులకు తగిన ప్రతిఫలం దక్కుతుందని అనుకున్నారు. కానీ, తీరా ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసి నివ్వెరపోయారు.

'ప్రభాస్ తల ఉంది, మరి బాడీ ఎవరిది', 'అమీర్ పేట్ ఎడిటింగా?', 'తల తీసుకొచ్చి అతికించినట్లు చాలా బాగుంది అన్నా', 'రోబోకి హెట్ అటాచ్ చేసినట్లుంది', 'ఆదిపురుష్ లో హనుమాన్ క్యారెక్టర్ బాగుంది అంటే అదే లుక్ ప్రాజక్ట్ కెలో పెడతారా?' అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

ఎర్త్ మ్యాన్: అంతేకాకుండా 'ఆదిపురుష్ లుక్ బెటర్', 'ఇంకో పెద్ద రాడ్', 'కొంప ముంచారు కదరా', 'అది ఫ్యాన్ మేడ్ లా ఉంది', 'టీఎమ్టీ రాడ్ యాడ్ లో రానా ఇలాగే ఉంటాడు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం బాగుందని చెబుతున్నారు. 'కొత్త అవతారం, న్యూ ఎర్త్ మ్యాన్' అంటూ అభిమానం చాటుకుంటున్నారు. ఇలా ప్రభాస్ లుక్ పై వివిధ రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X