చెప్పినట్లుగానే సర్‌ప్రైజ్ చేసిన ప్రభాస్.. వెల్లువెత్తుతున్న కామెంట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుగా చెప్పినట్లుగానే సర్‌ప్రైజ్ చేశారు. ఓ రోజు ముందుగానే స్వయంగా ఆయనే ఓ వీడియో ద్వారా అందరి ముందుకొచ్చి మరీ సర్‌ప్రైజ్ చేస్తానని చెప్పడంతో.. ఇంతకీ అది ఏమై ఉంటుందా అని ప్రేక్షక లోకంలో అమితమైన ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తిని తెరదించుతూ ప్రభాస్ తాజాగా సర్‌ప్రైజ్ చేశారు ప్రభాస్. ఈ మేరకు ఆయన సాహూ సినిమా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
''డార్లింగ్స్ ఇదిగో మీకోసం ఈ సర్‌ప్రైజ్.. నా తదుపరి సినిమా సాహూ అఫీషియల్ పోస్టర్ ఇది. ఆగస్టు 15 వ తేదీన థియేటర్స్‌లో కలుద్దాం'' అని తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పేర్కొంటూ రిలీజ్ డేట్‌తో కూడిన సాహూ పోస్టర్ పెట్టారు ప్రభాస్. ఇక తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ ఆకర్షణీయంగా ఉంది. గాగుల్స్ ధరించిన ప్రభాస్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. యూనిట్ ముందుగా చెప్పినట్లుగానే ఆగస్టు 15 వ తేదీని విడుదల తేదీగా ప్రకటించేసింది.

బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్‌గా ఎదిగారు ప్రభాస్. ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ ఆయన తదుపరి సినిమా సాహూ పట్ల మరింత ఆసక్తిని నెలకొల్పింది. భారీ అంచనాల నడుమ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 400 కోట్ల బడ్జెట్‌తో సాహూ తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తోంది. చిత్రంలో ఒళ్ళు గగ్గుర్లు పొడిచే యాక్షన్ సీన్స్ పొందుపర్చారు డైరెక్టర్ సుజీత్. ఈ సీన్స్‌లో ప్రభాస్‌తో పాటు శ్రద్దా కపూర్ కూడా నటించిందట. ఇప్పటికే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహూ వీడియోస్ ఈ సినిమా రేంజ్‌ని తెలియజేయగా తాజాగా విడుదలైన పోస్టర్ మరింతగా ఆకట్టుకుంది. తెలుగు చిత్రసీమ చరిత్రలో సాహూ మరో మైలురాయిగా నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఆగస్టు 15 తో ఈ అంచనాల తాలూకు రిసల్ట్ బయటకు వచ్చేస్తుంది.


Click it and Unblock the Notifications











