ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ ఆగిపోయినట్లే.. గోపిచంద్ కావాలనే వద్దన్నాడట!
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం అనే ఆలోచనను ప్రజలు ఆల్ మోస్ట్ మరిచిపోయారు. హీరోలకు సమన్యాయం చేయలేమని చాలా సార్లు ఆ కథల వైపు దర్శకలు కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక RRR పుణ్యమా అని ఇష్టమైన స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం దక్కనుంది.

గోపిచంద్ - ప్రభాస్ మల్టీస్టారర్..
ప్రభాస్ గోపిచంద్ వంటి హీరోలు కూడా ఆ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమా చేస్తారనే టాక్ వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో గోపిచంద్ కూడా తప్పకుండా ప్రభాస్ నేను కలిసి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాం అని వివరణ ఇచ్చాడు. గోపిచంద్ ఇచ్చిన క్లారిటికి అప్పట్లో ఇరు వర్గాల అభిమానుల్లో ఆనందాలు మొదలయ్యాయి.

బెస్ట్ ఫ్రెండ్స్..
ప్రభాస్ గోపిచంద్ ఎంత మాంచి స్నేహితులో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇద్దరి కెరీర్ లు దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. సినిమాల్లోకి రాక ముందు నుంచే బైకుల మీద గల్లీలల్లో తిరిగేవారు. వర్షం సినిమాతో ప్రభాస్ హీరోగా గోపీచంద్ విలన్ గా ఒక రేంజ్ లో క్లిక్కయ్యారు. ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే బావుంటుందని అప్పుడే టాక్ మొదలైంది.

గోపిచంద్ కోసం..
కెరీర్ లో ప్రభాస్ సినిమా సినిమాకు తన క్రేజ్ ని పెంచుకుంటూ పోతుండగా గోపిచంద్ మాత్రం మీడియం స్టేజ్ లోనే ఆగిపోయాడు. ఈ క్రమంలో కుదిరితే గోపిచంద్ తో మంచి సినిమా చేయాలని ప్రభాస్ చాలా సార్లు అనుకున్నారట. కానీ కథ సెట్టవ్వలేదు. ఇక ఆ మధ్య గోపిచంద్ జిల్ సినిమా చేయడానికి ప్రభాస్ ముఖ్య కారణం. యూవీ క్రియేషన్స్ లో ఛాన్స్ ఇప్పించి గోపి మార్కెట్ పెరిగేలా చేశాడు.

బాహుబలి తరువాత..
బాహుబలి సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ రేంజ్ అమాంతంగా పెరిగిపోవడంతో ప్రభాస్ తో గోపిచంద్ మల్టీస్టారర్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదు. అందుకే గోపిచంద్ ఆలోచించి ఇద్దరికి అది మైనెస్ గానే ఉంటుందని ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేశారట. ఆల్ మోస్ట్ కథ సెట్టయ్యింది అనుకున్న సమయంలో ఎవరికి తెలియకుండానే క్యాన్సిల్ చేసుకున్నారు. మరి భవిష్యత్ లో గోపిచంద్ కెరీర్ కోసమైనా ప్రభాస్ ఒక సినిమా చేస్తాడేమో చూడాలి..


Click it and Unblock the Notifications











