ముక్కలుగా యూవీ క్రియేషన్స్.. ఒకే గూటి నుంచి ప్రభాస్ మూడు బ్యానర్లు
యూవీ క్రియేషన్స్ అనేది టాలీవుడ్ లో డార్లింగ్ ప్రభాస్ హోం బ్యానర్ అనే పేరుంది. దీనికి కారణం యూవీ క్రియేషన్స్ ప్రభాస్ తో మిర్చి, సాహో, రాధేశ్యామ్ సినిమాలని భారీ బడ్జెట్ తో నిర్మించడమే అని చెప్పాలి. ఇక యూవీలో ప్రభాస్ అన్న ప్రమోద్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. ఇక మిగతా వారు కూడా ప్రభాస్ స్నేహితులే. ఈ నేపథ్యంలో ప్రభాస్ హోం బ్యానర్ అనే పేరు ఉంది.
ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి అనే మూవీ వస్తోంది. ఆదిపురుష్ మూవీకి నిర్మాణ భాగస్వామిగా యూవీ క్రియేషన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగులో యూవీ నుంచి ఈ మూవీ రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆ సినిమా తెలుగు స్టేట్స్ లో రిలీజ్ హక్కులు సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు యూవీ క్రియేషన్స్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ శెట్టి తర్వాత మరో సినిమా రావడం లేదు. అయితే యూవీ నుంచి గతంలో యూవీ కాన్సెప్ట్స్ అనే బ్యానర్ ఒకటి స్టార్ట్ అయ్యింది. ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నారు.
ఇక యూవీ నిర్మాతలలో ఒకరైన విక్రమ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి వి మెగా క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ చేశారు. ఇందులో మొదటి మూవీగా ది ఇండియా హౌస్ అనే పాన్ ఇండియా సినిమాని నిఖిల్ తో స్టార్ట్ చేశారు. ఇక యూవీ నుంచి మాస్ మూవీ మేకర్స్ అనే మరో నిర్మాణ సంస్థ కూడా రాబోతోంది. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పటికే ఒక మూవీ ప్లానింగ్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇలా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాతలు ఒక్కొక్కరు ఒక్కో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశారు. అయితే యూవీ బ్యానర్ ని కంప్లీట్ గా ఆపేసి ఈ కొత్త బ్యానర్స్ లోకి వస్తున్నారా లేక దానిని కూడా కొనసాగిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











