ఫ్రభాస్‌కు స్వల్ప ప్రమాదం.. ఫౌజీ షూటింగులో ఏం జరిగిందంటే?
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ది రాజాసాబ్ చిత్రం ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ఫౌజీ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. మరో పక్క సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని రోజుల షూటింగ్ పూర్తి చేసుకొని గ్లింప్స్‌ను తన అభిమానులకు అందించారు. అయితే తాజాగా ఫౌజీ సినిమా షూటింగులో ఆయన స్వల్పంగా గాయపడ్డారు అనే విషయం అభిమానులను కంగారు పెట్టించింది. అయితే ఆ గాయం నుంచి అభిమానులు ఎలాంటి ఆందోళన చెందకూడదని ఆయన పీఆర్ వర్గాలు వెల్లడించాయి. ఈ స్వల్ప ప్రమాదం గురించిన వివరాల్లోకి వెళితే..
ఫౌజీ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా జరుగుతున్నది. ఈ మూవీ కోసం యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారు. అయితే గుర్రం స్వారీ సీక్వెన్స్ సందర్భంగా ప్రభాస్ పట్టుతప్పి కిందపడ్డారు. దాంతో చిన్నగా గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స చేసిన తర్వాత కొంత రెస్ట్ అవసరమని భావించారు. అయితే గాయం గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. చాలా చిన్న గాయమైంది. ప్రభాస్‌కు గాయం అంటూ వస్తున్న రూమర్లు, ఊహాగానాలను ఆయన పీఆర్ వర్గాలు ఖండించాయి. షూటింగులో యాక్షన్ సీన్ల సందర్భంగా ఇలాంటివి సహజమే అని వారు అన్నారు.

ది రాజాసాబ్ చిత్రం రిలీజ్ తర్వాత బాడీ డబుల్ ఉపయోగిస్తారని ప్రచారం చేసిన వారి నోర్ల ప్రభాస్ ఫౌజీ కోసం చేస్తున్న రిస్కీ షాట్స్ మూయిస్తాయి. ప్రభాస్ ఈ సినిమా షూటింగులో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. హను రాఘవపూడి ఈ సినిమాను ఛాలెంజింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ నట విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం కొనసాగుతున్నది అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌తో పాకిస్థానీ నటి ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్నది. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు నటిస్తున్నారు. 1940 సంవత్సరం బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ జవాన్‌గా కనిపించబోతున్నారు. ఈ పిరియాడిక్ డ్రామా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను అక్డోబర్ 2026 రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం టాకీ పార్ట్‌ను త్వరగా చేయాలని ప్రభాస్ సిద్దమయ్యారు అని టీమ్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











