నయన్ అంటే ఇష్టం అనేసిన ప్రభాస్.. ఆమెలో నచ్చేవి అవే అంటూ!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఈ చర్చలకు కారణం ఆయన తాజా సినిమా 'సాహో'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యూనిట్ సభ్యులు.
తెలుగుతో తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సాహో విడుదల కానున్న సందర్బంగా ముంబై, తమిళనాడు తదితర ప్రదేశాల్లో ప్రభాస్ పర్యటించారు. అయితే 'సాహో' తమిళ వెర్షన్ ప్రమోషన్ లో భాగంగా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ఉన్న తమిళ హీరోయిన్స్ లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? అని మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నపై ప్రభాస్ స్పందించారు. తనను నయనతార అంటే ఇష్టమని, వెండితెరపై ఆమె కనిపించే తీరు, కనబర్చే అభినయం తనకు బాగా నచ్చుతాయని పేర్కొన్నారు ప్రభాస్. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'యోగి' సినిమాలో నటించారు.

ఇక సాహో సినిమా విషయానికొస్తే.. ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు సాహో పైనే ఉంది. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుండటం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











