కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి.... ‘సాహో’ ప్రభాస్ ఇంట్రో సీన్ లీక్, గూస్ బంప్సే..
కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్... ఈ డైలాగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తప్ప మరెవరికీ సూటవ్వదు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన భారీ చిత్రం 'సాహో' గ్రాండ్ లెవల్లో విడుదలైంది. దాదాపు రెండేళ్ల తర్వాత తమ అభిమాన హీరోను తెరపై చూసి అభిమానులు మైమరిచిపోతున్నారు.
ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ఇంట్రో సీన్ డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలనుకుంటున్నారు అనే విషయాన్ని దర్శకుడు సుజీత్ బాగా క్యాచ్ చేశాడు. ఇంట్రడక్షన్ సీన్ గూస్ బంప్స్ వచ్చేలా డిజైన్ చేశారు. సినిమా రిలీజైన వెంటనే ఈ సీన్ సోషల్ మీడియాలో లీకైంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ ఇంట్రో సీన్
ప్రభాస్ ఇంట్రో సీన్ కొందరు అభిమానులు సెల్ ఫోన్లో చిత్రీకరించి ట్విట్టర్లో షేర్ చేశారు. సిక్స్ ప్యాక్ బాడీతో ప్రభాస్ లుక్ కళ్లు చెదిరేలా ఉంది. లీకైన సీన్ చూస్తుంటే బ్యాడ్ బాయ్ సాంగుతో సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.
గూస్ బంప్స్ అంటున్న అభిమానులు
థియేటర్లో ప్రభాస్ ఇంట్రడక్ష సీన్ చూసి ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. యంగ్ రెబల్ స్టార్‌ను తెరపై అలా చూడగానే గూస్ బంప్స్ వచ్చాయంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ‘సాహో' మూవీ అభిమానులకు పూర్తి విందు భోజనంలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండియా వైడ్ గ్రాండ్ రిలీజ్
‘సాహో' చిత్రాన్ని ఇండియా వైడ్ గ్రాండ్‌గా విడుదల చేశారు. కేవలం నార్త్ ఇండియాలోనే 4 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. సైతిండియాలో 2 వేలకుపైగా థియేటర్లలో విడుదలైనట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 80శాతం థియేటర్లలో ఈ సినిమానే ప్రదర్శితం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజైనట్లు తెలుస్తోంది.

బాహుబలి స్థాయిలో రెస్పాన్స్ ఉందా?
ప్రభాస్ గత చిత్రం బాహుబలి ఇండియా వైడ్ విడుదలైనపుడు రెస్పాన్స్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ‘సాహో'కు మంచి రెస్పాన్సే ఉంది కానీ బాహుబలి స్థాయిలో మాత్రం లేదు. తొలి రోజు షో తర్వాత సినిమాకు వచ్చే టాక్ బట్టి ప్రేక్షకుల తాకిడి ఎలా ఉండబోతోంది అనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది.


Click it and Unblock the Notifications











