దేవుడిలా మారిపోయిన ప్రభాస్.. గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ కన్నప్ప
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న హీరోల నుంచి పెద్ద పెద్ద స్టార్ల వరకూ అందరూ పాన్ ఇండియా సినిమాలను చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది బహు భాషా సినిమాలు చేసి సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా పలువురు హీరోలు అదే దారిలో వెళ్తున్నారు. అందులో మంచు విష్ణు కూడా 'కన్నప్ప' అనే క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నాడు.
చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న మంచు విష్ణు.. ఈ సారి భారీ హిట్‌పై కన్నేశాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు అతడు 'కన్నప్ప' అనే సినిమాను చేస్తున్నాడు. మహా శివుడి పరమ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీన్ని ముకేష్ కుమార్ సింగ్ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో రాబోతుంది.

మంచు విష్ణు లీడ్ రోల్‌లో నటిస్తోన్న 'కన్నప్ప' సినిమాకు సంబంధించిన షూటింగ్ కొన్ని నెలల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని షూట్ చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మంచు విష్ణు నటిస్తోన్న 'కన్నప్ప' మూవీలో ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా భాగం అయ్యాడు. అది షెడ్యూల్ పూర్తైన వెంటనే ఇప్పుడు ఇందులో రెబెల్ స్టార్ ప్రభాస్ అడుగు పెట్టాడు. ఈ విషయాన్ని చిత్ర హీరో మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
'కన్నప్ప' సినిమాలో మహా శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా అతడు ఈ సినిమా షూటింగ్‌లో భాగం అయ్యాడు. ఈ విషయాన్ని చెబుతూ మంచు విష్ణు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఇందులో దేవుడిలా మారిపోయిన ప్రభాస్ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇదిలా ఉండగా.. 'కన్నప్ప' సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ వంటి స్టార్లు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి మణి శర్మ, స్టీఫెన్ సంగీతం ఇస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తీస్తున్నారు.


Click it and Unblock the Notifications











