The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు మారుతి షాక్.. రాజా సాబ్ లో ఆ సీన్స్ లేనట్లేనా?

The Raja Saab: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో ఎనలేని క్రేజ్, స్టార్డమ్ సంపాదించుకున్న హీరోలలో ప్రభాస్ (Prabhas) ఒకరు. వరుస విజయాలను అందుకుంటూ.. ప్రతి సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్నారు. ఒకప్పుడు 'రెబల్ స్టార్' ఇమేజ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రభాస్, బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ఆయన నటిస్తున్న ప్రతి సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'రాజాసాబ్' మూవీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కిన మూవీ 'ది రాజా సాబ్'. ఈ సినిమాలో ఎవరూ ఊహించిన విధంగా ప్రభాస్ ఓ కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన 'ది రాజా సాబ్' రెండో ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్ ఆరంభం నుంచి చివరి వరకు గ్రాండ్ విజువల్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మారుతి ప్రభాస్‌ను చూపించిన విధానం అభిమానుల్లో కొత్త ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేసింది. కానీ, ట్రైలర్ చివర్లో వచ్చిన ట్విస్ట్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది.

Prabhas Joker Look Shocks Fans as Director Maruthi Reveals Raja Saab Part 2 Twist

అయితే.. ట్రైలర్ లాస్ట్ షాట్‌లో ప్రభాస్‌ను జోకర్ గెటప్‌లో చూపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారనే చెప్పాలి. ఆ ఒక్క షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ప్రభాస్ మళ్లీ తన ఇమేజ్‌ను బ్రేక్ చేశాడు', 'ఇలాంటి లుక్ ట్రై చేయడం అంటే రిస్క్ తీసుకున్నట్టే' అంటూ కామెంట్స్ వెల్లువెత్తాయి. ఇది కేవలం ఒక లుక్ మాత్రమే కాదు.. ప్రభాస్ తన పాత్ర కోసం ఎంత డెడికేషన్‌తో పనిచేశాడో చెప్పే స్టేట్‌మెంట్‌లా మారింది. పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నప్పటికీ, ఇలాంటి విభిన్నమైన గెటప్‌ను ఎంచుకోవడం అంటే నిజంగా సాహసమేనని చెప్పాలి. అయితే ఈ జోకర్ లుక్ కథలో ఎంతవరకు న్యాయం చేస్తుంది? ఇది కేవలం షాకింగ్ ఎలిమెంట్‌గా మిగిలిపోతుందా? అనే చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చాయి. ట్రైలర్‌లో కనిపించిన జోకర్ షాట్స్ అసలు 'ది రాజా సాబ్' పార్ట్ 1లో ఉండవని, అవి పార్ట్ 2కి లీడ్‌గా మాత్రమే ఉంటాయని మారుతి స్వయంగా వెల్లడించారు. 'ట్రైలర్‌లో చూపించిన జోకర్ షాట్స్ పార్ట్ 2కి లీడ్‌గా ఉంటాయి. పార్ట్ 1లో ఆ ఎపిసోడ్ ఉండదు. పార్ట్ 2 కోసం ఒక లైన్ అనుకున్నప్పుడు ప్రభాస్‌కి చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. వెంటనే ఆ షాట్స్ తీశాం. పార్ట్ 2లో ఇవి హైలైట్‌గా నిలుస్తాయి' అంటూ మారుతి వ్యాఖ్యానించారు.

ఈ కామెంట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ట్రైలర్‌లో చూపించిన హైప్ క్రియేట్ చేసే జోకర్ అవతార్ పార్ట్ 1లో లేదని ముందే చెప్పడం అవసరమా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సీక్రెట్‌ను సినిమా రిలీజ్ తర్వాతే రివీల్ చేసి ఉంటే హైప్ మరింత పెరిగేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ట్రైలర్‌లో జోకర్ లుక్ చూపించి, ఆ తర్వాత అది పార్ట్ 1లో ఉండదని చెప్పడం ద్వారా అభిమానుల ఎక్సైట్మెంట్‌కు బ్రేక్ పడినట్టు ఫీలవుతున్నారు. 'ఆ షాట్స్ ఎందుకు పెట్టారు? కథలో వాటి ప్రాముఖ్యత ఏంటి? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకునేలా వదిలితే బాగుండేది' అని రెబల్ స్టార్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇలా మారుతి ముందుగానే కొన్ని కీలక విషయాలను బయటపెట్టడంతో అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తొలిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్న మారుతి, ఆ ఉత్సాహంలో కొన్ని సీక్రెట్లను ముందే రివీల్ చేశాడన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. జనవరి 9న థియేటర్లలోకి రానున్న 'ది రాజా సాబ్' విడుదల తర్వాత ఈ జోకర్ అవతార్ నిజంగా ఎంత ప్రభావం చూపిస్తుందో, పార్ట్ 2లో అది ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాల్సిందే. అప్పటివరకు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు మారుతి ఇచ్చిన ఈ షాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X