Project K కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో వైజయంతీ మూవీస్ ఒకటి. 1972లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థకు అధిపతి అశ్వనీ దత్ చలసాని అని తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో అశ్వనీ దత్ తో పాటు ఆయన కుమార్తె స్వప్న దత్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. అలాగే ఆమె స్వప్న సినిమాస్ అనే ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి అనేక సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి. ఇప్పుడు ఈ సంస్థ జూబ్లీ గోల్డెన్ మూవీగా వస్తోన్న ప్రాజెక్ట్ కె నటీనటుల పారితోషికాలు ఆసక్తిగా మారాయి. ఎవరికీ ఎంత రెమ్యునరేషన్ ముట్టజెపుతున్నారనే వివరాల్లోకి వెళితే..
ప్రతిష్టాత్మక చిత్రం : జగదేక వీరుడు అతిలోక సుందరి, రాజకుమారుడు, స్టూడెంట్ నెంబర్ 1, ఇంద్ర, దేవదాస్, మహానటి, సీతా రామం వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా నడుస్తోన్న క్రమంలో వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మక రూపొందిస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె.

నటీనటులు : మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో పాన్ ఇండియా స్ట్రార్ ప్రభాస్ హీరోగా చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటిలు దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఇంకా వాటిని పెంచేలా పోస్టర్స్, వీడియోస్ కూడా వదిలారు.

ఉలగ నాయగన్ ఎంట్రీ : ఇక తాజాగా ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిన ప్రాజెక్ట్ కెలోకి కమల్ హాసన్ ఇప్పుడు అడుగు పెట్టారు. ఆయన ఈ సినిమా కోసం ఆగస్టు నెల (30 రోజులు )మొత్తం షూటింగ్ చేస్తారని టాక్ ఉంది.

పారితోషికాలు : ఇక ప్రాజెక్ట్ కె సినిమాలో నటీనటుల పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి రూ. 150 కోట్లు ఇస్తుంటే అతన్ని ఢీ కొట్టే కమల్ హాసన్ కు రూ. 20 నుంచి 30 కోట్ల పారితోషికం ముట్టజెపుతున్నారట. అయితే ఇది అతి తక్కువ రోజులకు అని టాక్ నడుస్తోంది. ఆ రెమ్యనరేషన్ నెలకా? లేదా అంతకు చాలా తక్కువ రోజులకా? అనేది క్లారిటీ లేదు.
అమితాబ్-దీపికాకు : ఇక హీరోయిన్ దీపికా పదుకొణెకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు మిగతా నటీనటులకు రూ. 10 కోట్ల పారితోషికం అందజేస్తున్నారట. ప్రాజెక్ట్ కె నటీనటుల పారితోషికం అంతా రూ. 200-210 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ప్రొడక్షన్ బడ్జెట్ రూ. 400 కోట్లు కాగా మొత్తం ఖర్చు రూ. 600 కోట్లుగా ఉందని విశ్లేషకుల నుంచి వచ్చిన సమాచారం.

దేశంలోనే తొలి సినిమా : ప్రాజెక్ట్ కె సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో భారీగా నాన్ థియేట్రికల్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలోనే అత్యంత భారీ ధర ఈ సినిమాకే వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్ ను నిర్మాత అశ్వనీ దత్ ఇంకా అంగీకరించలేదట. వివిధ రకాలుగా వచ్చే ఈ నాన్ థియేట్రికల్ డబ్బు సినిమా బడ్జెట్ లో 60 శాతం కంటే ఎక్కువగా ఉండొచ్చని టాక్.


Click it and Unblock the Notifications











