Project K బిగ్ న్యూస్: ఇంటర్నేషనల్ వేదికపై 'ప్రాజెక్ట్ కె' టైటిల్ రిలీజ్.. తొలి సినిమాగా రికార్డ్!
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఇలా ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలు ఉండగా.. జూలై 6న సలార్ గ్లింప్స్ తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ మరో ప్రతిష్టాత్మక చిత్రం ప్రాజెక్ట్ కె నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అయితే గత కొంతకాలంగా ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడంపై అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
నటీనటులు: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె తొలిసారి జత కట్టిన సినిమా ప్రాజక్ట్ కె. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని అగ్ర తారగణం నటించబోతుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ ప్రతినాయకుడిగా మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

చివరి అవతారం: విష్ణువు చివరి అవతారం కల్కిగా ప్రభాస్ పాత్ర ఉండబోతున్న ప్రాజెక్టె కె నుంచి విడుదలైన పోస్టర్స్, మేకింగ్ వీడియోలు క్యూరియాసిటీ పెంచేశాయి. అయితే సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె విడుదలకు ముందే అరుదైన గౌరవాన్ని అందుకుంది. జూలై 20న ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వాటిని ఇంటర్నేషనల్ వేదికపై చాలా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

ప్రపంచ వేదిక: అమెరికాలోని శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) వేడుకలు జూలై 19 నుంచి జరగునున్నాయి. ఈ వేడుకల్లో జూలై 20 నాడు ప్రాజెక్ట్ కె టైటిల్ తో పాటు గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఈ SDCC కార్యక్రమానికి ప్రభాస్, నాగ్ అశ్విన్ తోపాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ వేదికపై టైటిల్ అనౌన్స్ జరుగుతున్న తొలి సినిమాగా ప్రాజెక్ట్ కె నిలవనుంది. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

సూపర్ హీరోలకు నిలయం: శాన్ డియాగో కామిక్-కాన్ వేడుకలో ప్రాజెక్ట్ కె టైటిల్ అనౌన్స్ మెంట్ పై నాగ్ అశ్విన్ రియాక్ట్ అవుతూ సంతోషం వ్యక్త పరిచారు. "ఇండియా కథలు చాలా గొప్పవి. ఇండియా అనేది సూపర్ హీరోలకు నిలయం. మా చిత్రం ప్రాజెక్ట్ కె గురించి ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాం. అందుకు కామిక్ కాన్ సరైన గొప్ప వేదిక అనిపించింది" అని నాగ్ అశ్విన్ తెలిపారు.
అడుగులేస్తున్నాం: "భారతీయ సినిమా నిర్మాణ సంస్థల్లో ప్రముఖమైన ఒకటిగా ఈ అసాధార ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా గర్వంగా ఉంది. భారతీయ సినిమా సరిహద్దులను అధిగమించడం కోసం మన దేశంలోని అతిపెద్ద సూపర్ స్టార్ లతో కలిసి కొత్తగా అడుగులేస్తున్నాం. భారతీయ చిత్రాన్ని ప్రపంచ మ్యాప్ పై చూడాలనుకునే భారతీయ ప్రేక్షకులందరికీ ఇది గర్వకారణమైన క్షణం. కామిక్ కాన్ మాకు ఒక ప్రపంచ వేదిక" అని నిర్మాత అశ్వినీదత్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











