మొదటిసారి ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ క్యాన్సిల్

రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క మాట చెబితే చాలు కథలు రెడీ చేయించడానికి చాలా మంది నిర్మాతలు క్యూలో ఉన్నారు. కానీ ప్రభాస్ ఒప్పుకున్న ప్రాజెక్టులను చూస్తే ఇప్పట్లో డేట్స్ దొరికేలా లేవని అర్థమవుతోంది. ఇక మొదటిసారి అంతా ఒకే అనుకున్న సమయంలో ప్రభాస్ ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు చర్చల దశలోనే క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెబల్ స్టార్ రాధేశ్యామ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఆ తరువాత ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాల్సి ఉంది. అయితే వీటితో పాటు KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన ఒక స్టోరీ లైన్ కి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ యూవీ క్రియేషన్స్ లోనే సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. నిజానికి చర్చలు అయితే జరిగాయి గాని ఎందుకో వర్కౌట్ కాలేదట.

Prabhas kgf director prashanth neel combo cancelled

బహుశా ప్రభాస్ బిజీగా ఉండడంతో పాటు ఒక్కో సినమాకు ఒక్కో లుక్ తో కనిపించాలి కాబట్టి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని అర్ధమయ్యింది. అందుకే ఆ ప్రాజెక్ట్ కి రెండేళ్లయినా కూడా డేట్స్ ఇవ్వలేనని చెప్పడంతో ప్రశాంత్ డ్రాప్ అయ్యాడట. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక డీల్ సెట్ చేసుకోవలనే ప్రయత్నంలో ఉన్న ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో అనుకున్న కాన్సెప్ట్ ని మరో హీరోకు షిఫ్ట్ చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X