Top Heroes: బాలీవుడ్ హీరోలకు ప్రభాస్ షాక్.. షారుక్‌ను వెనక్కి నెట్టిన రెబల్.. దారిదాపుల్లో లేని తారక్, చరణ్,
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వారు మారే టాప్ హీరో అనే వాదన ముందుకు తీసుకొస్తారు. అయితే ఇండియా వైడ్‌గా సర్వే నిర్వహించిన ఆర్మాక్స్ సంస్థ ప్రతీ నెల ఓ రిపోర్టును పబ్లిష్ చేస్తుంది. అయితే ఈ నెల పాన్ ఇండియాలో టాప్ స్థానాన్ని ఎవరు ఆక్రమించారనే విషయంలోకి వెళితే..
ఇండియాలో అత్యధిక మంది ఇష్టపడే నటుల గురించి ఆర్మాక్స్ సంస్థ జూన్ నెలలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఓ రిపోర్టును ప్రదర్శించింది. ఈ సర్వేలో టాప్ 10లో అత్యథిక మంది తెలుగు హీరోలే తమ స్థానాలను భద్రపరుచుకొన్నారు. హిందీలో నలుగురు, తమిళంలో ఒక్కరు. తెలుగు నుంచి 5 గురు హీరోలు ఈ జాబితాలో చోటు సంపాదించుకొన్నారు.

అయితే ఆర్మాక్స్ జూన్ జాబితాలో బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఉన్నారు. ఇక తమిళం నుంచి ఇళయ దళపతి విజయ్ ఏకైక హీరోగా కనిపించారు. తెలుగులో రాంచరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్నారు.
ఇక 10వ స్థానం.. ఈ జాబితాలో చిట్ట చివరి స్థానంలో నిలిచిన హీరో హృతిక్ రోషన్. ఆయన ఇటీవల కాలంలో ఫైటర్ సినిమాతో కొంత మేరకు సక్సెస్ అందుకొన్నారు. ఇక రాంచరణ్ 9వ స్థానంలో నిలిచారు. గత రెండేళ్లుగా ఆయనకు సినిమా లేకపోవడం తెలిసింది. వరుస ఫ్లాపులతో ఉన్న సల్మాన్, అక్షయ్ కుమార్ 8వ, 7వ స్థానంలో నిలిచారు.

అత్యధిక మంది ఆరాధించే ఆర్మాక్స్ జాబితాలో 6వ స్థానంలో మహేష్ బాబు, 5వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, 4వ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఇక పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకొన్న సంగతిత ెలిసిందే. అయితే దేవర చిత్రంతో పాన్ ఇండియా మూవీ హీరోగా తారక్ మారనున్నారు. రాజమౌళి సినిమాతో మహేష్ కూడా పాన్ వరల్డ్ యాక్టర్ అవుతారేమో చూడాలి.
ఇక ఆర్మాక్స్ జాబితాలో మూడో స్థానంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ ఉన్నారు. ఇటీవల లియో సినిమాతో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోల జాబితాలో నిలిచారు. ఇక ఆ తర్వాత స్థానంలో షారుక్ ఖాన్ నిలిచారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ బాద్షా జవాన్, పఠాన్ సినిమాలో బ్లాక్ బస్టర్లు అందుకొన్నారు. ఇక నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలిచారు. ఇటీవల ఆదిపురుష్ డిజాస్టర్ తర్వాత కల్కి 2898 AD మూవీతో 1000 కోట్ల క్లబ్‌లో చేరారు.


Click it and Unblock the Notifications











