The Rajasaab: ప్రభాస్ ఏంటో ప్రపంచానికి తెలుసు.. రాజాసాబ్ ఏఐ రూమర్స్‌పై మారుతి ఫైర్..
The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్,ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సినిమాపై వస్తున్న రూమర్స్ ను దర్శకుడు మారుతి తీవ్రంగా ఖండించారు. ఇంతకీ ఏ రూమార్స్ ఏంటీ? డైరెక్టర్ మారుతి ఏమన్నారంటే?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ ' రాజాసాబ్' సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పడం లేదని, ఏఐ టెక్నాలజీతో డబ్బింగ్ చేయిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రూమర్స్ పై డైరెక్టర్ మారుతి తీవ్రంగా స్పందించారు. 'ఇవన్నీ మాటలు ఎవరు అంటున్నారు? ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. ఈ రూమర్స్‌ను అందరూ ఖండించాలి'అని స్పష్టంగా చెప్పారు.
సోషల్ మీడియాలో రోజూ వందల ప్రచారాలు జరుగుతుంటాయని, ప్రతి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ ప్రభాస్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 'ఎవడో ఒకడు ప్రభాస్ అంటే పడని వాడు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇది ప్రభాస్ ఇమేజ్‌పై బురదజల్లే ప్రయత్నం. నేనేంటో ప్రభాస్‌కు తెలుసు, ప్రభాస్ ఏంటో ఈ ప్రపంచానికి తెలుసు' అంటూ మారుతి వ్యాఖ్యానించారు.
ప్రభాస్‌తో కోట్లాది మంది భావోద్వేగంగా కనెక్ట్ అయి ఉన్నారని, ఆయనను తెరపై ఎలా చూడాలా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కోట్లాది మంది అభిమానులు ఒక వ్యక్తికి రావడం అంత ఈజీ కాదని చెప్పిన మారుతి, 'ఎవడో ఫేక్ వెధవ క్రియేట్ చేసిన రూమర్స్ ఇవి' అంటూ తీవ్ర పదజాలంతో స్పందించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల ప్రభాస్‌కు ఎలాంటి నష్టం జరగదని, కానీ వాటిని స్ప్రెడ్ చేయకుండా అక్కడికక్కడే ఖండించాలని సూచించారు.
ఈ సందర్భంగా మారుతి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇస్తూ.. 'గుడిలో దేవుడు మన కోరికలు తీర్చడం లేదని అంటే, దేవుణ్ణి మొక్కడం మానేస్తామా? గుడికి వెళ్లడం తగ్గిస్తామా? అలా చేసినంత మాత్రాన దేవునికి ఏమైనా అవుతుందా?'అంటూ, ప్రభాస్‌పై ఎవరు ఏమన్నా ఆయన స్థాయికి ఏమీ కాదని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రభాస్‌పై చేసే కామెంట్స్‌తో ఆయన ఇమేజ్‌కి ఎలాంటి నష్టం ఉండదన్నారు.
ప్రస్తుతం డైరెక్టర్ మారుతి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో మారుతికి మద్దతుగా నిలుస్తూ, రూమర్స్‌ను ఖండిస్తున్నారు. మరోవైపు ది రాజాసాబ్ పై అంచనాలు మరింత పెరుగుతుండగా, ఈ రూమర్స్‌కు మారుతి ఇచ్చిన ఘాటు కౌంటర్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











