twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ వదిలిన ఆకాశవాణి ట్రైలర్.. ఆలోచింపజేస్తున్న రాజమౌళి శిష్యుడి మొదటి సినిమా!

    |

    అగ్ర దర్శకులు నుంచి వస్తున్న శిష్యులు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే అందులో మరికొందరు ఎక్కువ స్థాయిలో క్రేజ్ అయితే అందుకోవడం లేదు. ముఖ్యంగా అగ్ర దర్శకుడు రాజమౌళి నుంచి వచ్చిన శిష్యులు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ వారు అయితే కనిపించడం లేదు. ఆ మధ్యలో వచ్చిన త్రికోటి ఒక్కడే రెండు సినిమాలు చేశాదు. దిక్కులు చూడకు రామయ్య ,జువ్వ అనే రెండు విభిన్నమైన కథనాలను చేశాడు కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక ఆ తర్వాత మరికొంతమంది యువ దర్శకులు కూడా ఆయన స్కూల్ నుంచి వచ్చిన వారే కానీ వారి సినిమాలు కూడా ఎక్కువ కాలం నిలవలేదు.

    అయితే రాజమౌళి మాత్రం తన సహాయక దర్శకులకు మాత్రం వీలైనంత వరకు సాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ వారు ప్లాప్స్ అందుకుంటే మళ్లీ వారికి తన వద్దనే సహాయక దర్శకుడిగా పని కల్పిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత రాజమౌళి దగ్గర ఈగ సినిమా నుంచి పని చేస్తున్న ఒక యువ దర్శకుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాహుబలి సినిమాకు కూడా సెకండ్ యూనిట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసినటువంటి అశ్విన్ గంగరాజు మొదటి సినిమా ఆకాశవాణి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఆకాశవాణి సినిమాను మొదట థియేటర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. సోనీ లీవ్ లో ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేయించారు. 1 నిమిషం 46 సెకన్ల ట్రైలర్ లో కొండ ప్రాంతంలో నివసిస్తున్న అమాయక ప్రజల జీవితాలను ఎక్కువగా ఫోకస్ చేసినట్లు అనిపిస్తోంది.

    మూఢ నమ్మకాలు మరియు అణచివేత భూస్వామి మధ్య చిక్కుకున్న వారి కష్టాలను హైలెట్ చేశారు. ఒక రేడియో వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా పరిణామాలు మారిపోతాయి. ఒకప్పుడు, ఎక్కడో దూరంగా జరిగిన కధ.. అంటూ అంటూ ట్రైలర్ లో విజువల్స్ ని హైలెట్ చేశారు. AU & I స్టూడియోస్ పతాకంపై పద్మనాభ రెడ్డి నిర్మించిన ఆకాశవాణి సినిమా అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ దర్శకుడు నటుడు సముద్రఖని ముఖ్యమైన పాత్రలో నటించారు.

    Prabhas launched the trailer of Telugu film Aakashavani

    వినయ్ వర్మ, తేజ కాకుమాను మరియు ప్రశాంత్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఎక్కువగా కొత్త వారితోనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం సమకూర్చగా.. సురేష్ రఘుతు సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు. ఇక ఈ సినిమాకు ప్రస్తుత టాప్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు అంధించడం విశేషం. ఇక సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ సోనీ లీవ్ లో సెప్టెంబర్ 24 న విడుదల చేయనున్నారు.

    English summary
    Prabhas today launched the trailer of Telugu film Aakashavani
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X