ప్రభాస్ రిలీజ్ చేసిన ‘నువ్వు తోపురా’ ట్రైలర్... చూశారా?
సుధాకర్ కోమాకుల, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా బి హరినాథ్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నువ్వు తోపురా'. సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయింది.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ... 'నువ్వు తోపురా' మూవీ ట్రైలర్ చూశాను, చాలా బావుంది. 53 రోజులు యూఎస్ఏలో షూట్ చేశారు. చాలా కష్టపడి ఉంటారు, ఖర్చు అయి ఉంటుంది. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రైటర్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను' అన్నారు.
హీరో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ 'ప్రభాస్ అన్నతో మా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడం హ్యాపీగా ఉంది. ఆయన ఉంటే కొండంత ధైర్యం మాకు. బాహుబలి స్టార్ రిలీజ్ చేశారు కాబట్టి అంతా శుభం జరుగుతుందని భావిస్తున్నాం' అన్నారు.
బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరిగే సరూర్ నగర్ కుర్రాడు... సప్త సముద్రాలు దాటి యూఎస్ఏ వెళ్లి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ప్రేమ కోసం ఎలాంటి రిస్క్ చేశాడు అనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

యూనైటెడ్ ఫిల్మ్స్ బేనర్లో శ్రీకాంత్ దావులాయి ఎస్.జె.కె ప్రొడక్షన్స్‌తో అసోసియేట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రను ఒకప్పటి ప్రముఖ నటి నిరోషా పోషించారు. ఈ చిత్రానికి కథ, మాటలు: అజ్జు మహకాళి, సంగీతం: సెరేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ: ప్రకాష్ వేలాయుదం, వెంకట్ సి దిలీప్, ఎడిటర్: ఎస్.బి ఉద్దవ్.


Click it and Unblock the Notifications











